అధికారంలో కంటే విపక్షంలోనే చంద్రబాబు బాగా రాణిస్తారు. ఆయన అధికారంలో ఉన్నా కూడా  విపక్ష పాత్ర బాగానే  పోషించగలరు, దానికి గత ఏడాది మోడీకి వ్యతిరేకంగా అకాశాన్ని భూమిని ఒక్కటి చేసిన వైనం అందరినీ గుర్తుండి ఉంటుంది. ఇదిలా ఉండగా జగన్ సీఎం అయి గట్టిగా అయిదు నెలలు కూడా కాలేదు కానీ చంద్రబాబుకు కి మాత్రం యుగాలు గడఛినట్లుగా ఉందంటున్నారు. ఓ వైపు ఘోర అవమానం మరో వైపు చేజారినా కుర్చీ బాబుని తిన్నగా ఉండనీయ‌డంలేదు. ఇప్పటికే చేయాల్సినవి అన్నీ చేశారు. బురద బాగానే జల్లేశారు. అయినా బాబుకు తగినంత పొలిటికల్  హైప్ రావడంలేదంటున్నారు. 


దాంతో  బాబు తాజాగా ఓ నిర్ణయం తీసుకుంటున్నారుట. అదే నిరాహార‌ దీక్ష చేపట్టడం, ఈ నెల 14న చంద్రబాబు ఒక రోజు దీక్షకు కూర్చుంటున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి వస్తున్న అనధికార సమాచారం. చంద్రబాబు విజయవాడ వేదికగా  ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ ఈ దీక్ష చేపడతారట. ఓ విధంగా బాబు ఈ దీక్షతోనైనా హైలెట్ కావాలనుకుంటున్నారని అంటున్నారు.


ఈ దీక్ష ఎవరి కోసం అంటే ఇసుక కొరతతో బాధ పడుతున్న కార్మికుల కోసమట. ఇప్పటికే దీని మీద టీడీపీ ఆందోళలకు పిలుపు ఇచ్చింది అవి పెద్దగా సక్సెస్ కాలేదు, ఇక కుమారుడు లోకేష్ గుంటూర్లో దీక్షకు కూర్చున్నారు. అయినా అనుకూల మీడియా తప్ప ఎక్కడా హైలెట్ కాలేదు, మరి పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేస్తే మాత్రం ఏపీ ఒక్కసారిగా వేడెక్కింది. పవన్ సినీ క్రేజ్ అలాంటిది మరి.


దాంతో అధికారం ఎటూ పోయింది, విపక్షం సీటు కూడా పవన్ పరం అవుతుందన్న కంగారు తోనే బాబు ఈ దీక్షకు కూర్చుంటున్నారేమోనని వైసీపీ నేతలు అపుడే సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా పార్టీ ఓడిపోయిన తరువాత టీడీపీకి గ్రిప్ ఇంకా దొరకలేదు, ఒక్క సీటు గెలుచుకున్న జనసేనకు దారి ఏదో కనిపిస్తోంది కానీ ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అయిన బాబుకు, ఆయన పార్టీకి మాత్రం జనంలో అనుకున్న హైప్ క్రియేట్ కావడంలేదు. దాంతోనే ఈ దీక్షకు దిగుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: