కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం జారీ చేసిన జిఓ ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రతి ఏటా పదవ తరగతిలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు అబ్దుల్ కలాం పేరిటా ప్రతిభా అవార్డులు జారీ చేస్తారు. అయితే ఇప్పుడు కలాం ప్రతిభా అవార్డులను .. వైస్సార్ అవార్డులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల జగన్ తీవ్రంగా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. పేరు ఎందుకు మార్చారని అధికారులను నిలదీసినట్టు తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై పలువురు విమర్శలు చేసారు.  మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడం అంటే కలాంను అవమానించడమే అనే విమర్శలు వచ్చాయి.


అయితే రాజేశేఖర రెడ్డి గొప్ప వ్యక్తి అయినప్పటికీ .. దేశం మొత్తం గర్వించే గొప్ప వ్యక్తి కలాం కావటంతో పేరు మారిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. దీనితో ఈ విషయం పై సీఎం జగన్ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపైన సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. వెంటనే  ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.


ప్రతిభా పురస్కారాలకు ఇప్పటి వరకు ఏ పేరు అయితే ఉందో అంటే కలాం పేరునే కొనసాగించాలని జగన్ చెప్పారు.  అలాగే   ప్రభుత్వం అందజేసే అవార్డులకు దేశంలోని మహానీయులు పేర్లు కూడా పెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ జ్యోతిరావ్ పూలే అంబేడ్కర్ జగ్జీవన్రామ్ వంటి మహానీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని చెప్పారు. దీనితో ఇప్పుడు అధికార వర్గాలు పేర్లు మర్చి మళ్ళీ ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధం అయ్యింది. నిజానికి మహనీయుల పేర్లు మార్చడం అనేది ప్రజల్లో సహజంగానే తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: