ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలందరికీ పారదర్శక పాలన అందిస్తారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అమ్మఒడి  పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రజలందరూ తమ తమ పిల్లలను బడులకు పంపించేలా ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అమ్మ ఒడి పథకం వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద 15 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు... ప్రతి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 



 అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది జగన్ సర్కార్ . కాగా  జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం తో ఎంతోమంది పేద విద్యార్థులు కూడా పాఠశాలలకు వెళ్లి చదువుకోనే  పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేయక...  ఈ పథకం కొన్ని నిబంధనలు పెట్టింది ఏపీ సర్కార్. దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే అమ్మఒడి పథకం వర్తిస్తుందని జగన్ సర్కార్ నిబంధన పెట్టింది. 



 అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఈ పథకం అర్హులుగా ఉండడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది. కాగా  ప్రభుత్వ ఉద్యోగులు పీఎస్యూ  ఉద్యోగులు పెన్షనర్లు ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులనీ  తెలిపింది జగన్ సర్కార్. ఇక తాజాగా మరో షరతు కూడా విధించింది జగన్ ప్రభుత్వ 75 శాతం హాజరు కలిగిన విద్యార్థులకు  మాత్రమే అమ్మఒడి  పథకానికి అర్హులవుతారు అంటూ ప్రకటించింది. చదువుని విద్యాసంవత్సరం మధ్యలోనే ఆపేసి విద్యార్థులను ఈ పథకం నుంచి తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. చదువును మధ్యలో నిలిపి వేయకూడదని ఉద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని  అధికారులు చెబుతున్నారు. కాగా తాజాగా  జగన్ ప్రభుత్వం పెట్టిన కొత్త  నిబంధన కారణంగా ఈ పథకానికి అర్హులైన విద్యార్థులు అందరూ ప్రతిరోజు పాఠశాల కళాశాల కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పేద ప్రజలకు కూడా మెరుగైన విద్యను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం.


మరింత సమాచారం తెలుసుకోండి: