రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రమైన ఇబ్బందులు తీసుకొస్తోంది.  ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో నిర్మాణ రంగం ఆగిపోయింది.  నిర్మాణ రంగం ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  అభివృద్ధి కుంటుపడింది.  ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  దీనిని నిరసిస్తూ.. పవన్ కళ్యాణ్ నవంబర్ 3 వ తేదీన విశాఖలో లాంగ్ మార్చ్ చేశారు.  విశాఖలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ పై వైకాపా నాయకులు అనేక విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.  


లాంగ్ మార్చ్ అంటూ పవన్ కళ్యాణ్ ఒక్క అడుగు కూడా నడవలేదని.. కారుపై ఎక్కి చేతులు ఊపితే లాంగ్ మార్చ్ అవుతుందా అని ప్రశ్నించారు.  దీనిపై వైకాపా నాయకులు అనేక విమర్శలు చేస్తుం సంగతి తెలిసిందే.  వైకాపా నాయకుడు, మంత్రి బొత్సా శ్రీనివాస్ ఈ విషయంపై కామెంట్స్ చేశారు.  తెలుగుదేశం పార్టీ తుపాకిని పవన్ కళ్యాణ్ మోస్తున్నారని, బాబును వెనకేసుకు రావడం మంచిది కాదని బొత్సా పేర్కొన్నారు.  


దీంతో పాటుగా బొత్సా మరికొన్ని విమర్శలు కూడా చేశారు.  తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కొన్ని తీవ్రమైన విమర్శలు చేశారు.  నవంబర్ 14 వ తేదీన చంద్రబాబు నాయుడు ఇసుక కొరతను నిరసిస్తూ దీక్ష చేయబోతున్నారు.  ఉదయం నుంచి సాయంత్రం వరకు బాబు దీక్షకు కూర్చోబోతున్నారు.  బాబు చేయబోతున్న దీక్షపై విమర్శలు మొదలయ్యాయి.  బాలల దినోత్సవం రోజున దీక్షలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు.  


బాబుకు బుర్ర పాడైపోయిదని, ఆరోజున ఎవరైనా  దీక్షలు చేస్తారా అని ప్రశ్నించారు.  రాజధాని విషయంపై కూడా బొత్సా మాట్లాడారు.  తెలుగుదేశం పార్టీ చేసిన పనుల కారణంగా భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు.  ఇసుక కొరత తాత్కాలికమే అని చెప్పారు.  ఇసుక కొరత సమస్య త్వరలోనే తేరిపోతుందని, ఎవరూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అన్నారు బొత్స.  


మరింత సమాచారం తెలుసుకోండి: