ఢిల్లీ కాలుష్యం దేశం లో ప్రజలనందరిని ఆందోళనకు గురి చేస్తుంది దేశ రాజధాని కావడం అన్ని ప్రాంతాల ప్రజలు పనుల నిమిత్తం అక్కడ స్థిరపడడం లేదా వచ్చి వెళ్లడం జరుగుతుంటాయి అలాగే మనుషులకే కాదు ఆ పరిస్థితి ఎప్పుడు ప్రపంచ అందాలలో ఒకటైన  తాజ్‌మహల్ కట్టడానికి కూడా తగిలింది.

ప్రేమకు చిహ్నంగా నిర్మించనటువంటి అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ యమునా తీరంలో ఈ కట్టడాన్ని నిర్మించారు. 1632లో ప్రారంభించి 1648లో నిర్మాణం పూర్తి చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో నిర్మితమైన ఈ సుందరమైన కట్టడం కొన్ని శతాబ్దాలుగా చెక్కుచెదరలేదు.  ఏటా ప్రపంచ నాలు మూలాల నుండి  కొన్ని లక్షల మంది పర్యాటకులు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. కాలుష్య తీవ్రత వాళ్ళ మరియు సందర్శకుల తాకిడి వల్ల  తాజ్‌మహల్ గోడలు, ఫ్లోరింగ్ ధ్వంసం అవుతూ వస్తున్నాయి.

దీంతో రంగంలోకి దిగిన ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజ్‌మహల్‌కు నష్టం జరుగుతుందని భావించి తాజ్‌మహల్ చుట్టూ బారికేడ్లను ఏర్పాటుచేశారు. అయితే కాలక్రమేణా  ఈ పాలరాతి కట్టడం కాలుష్యం బారిన పడి దాన్ని పాల లాంటి రంగుని కోల్పోతూ వచ్చి అందాన్ని కోల్పోతూ వస్తోంది. ఇందుకు కారణం ఆగ్రా పరిసరాల్లో వివిధ  పరిశ్రమలు రావడం వాటి నుంచి వచ్చే భయంకరమైన వాయువులు, పొగ,దుమ్ము మొదలైన కాలుష్యంతో తాజ్‌మహల్ అందం చెదరిపోతోంది. ఎలాంటి పరిణామాలలో  గత కొన్ని సంవత్సరాలుగా  స్వల్ప మరమత్తులు చేస్తూనేఉన్నారు.

అందులోని కొన్నినల్లబడ్డ మరియు శిధిలమైన  రాళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త రాళ్లను అధికారులు పెట్టాలని యోచిస్తున్నారు ఇక ఈ రాళ్ల మార్పిడి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలోనేజరిగినట్లయితే  ఈ పనులతో పర్యాటకులను అనుమతించకపోవచ్చని అంచనా  ఒకవేళ అదే జరిగితే పర్యాటక రంగం, పర్యాటకులను నమ్ముకుని కాలం వెల్లదీస్తున్న చిరువ్యాపారులకు నష్టం తప్పదని చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: