తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు మరో షాక్ తగిలింది. శశికళకు చెందిన రూ.1600కోట్ల విలువచేసే ఆస్తులను ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి ఈరోజు ఉదయం ఆస్తులు సీజ్ చేశారు. బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద ఆస్తుల్ని జప్తు చేశారు. 


2016 పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆమె ఆస్తులు కొనుగోలు చేసినట్లు కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీంతో చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరిలో కలిపి మొత్తం తొమ్మిది ఆస్తుల్ని జప్తు చేశారు. అయితే ఈ విషయాలన్నింటిని జైలులో ఉన్న శశికళకు కూడా తెలియచేసారు. 


కాగా 2017లో అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని అగ్రహారం జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్న విషయం అందరికి తెలిసిందే. 2016లో నోట్ల రద్దు తర్వాత కొంతమంది బినామీల పేరిట శశికళ రూ.1500కోట్ల విలువ చేసే ఆస్తుల్ని కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే 2017లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాల్లో తొలిసారి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 


కాగా జైలు శిక్ష అనుభవిస్తున్నా శశికళ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా నిరూపణ అవ్వడంతో ఆమెకి కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష వేసింది. దింతో ప్రస్తుతం ఆమె జైలు శిక్ష అనుభవిస్తుంది. అయితే అక్కడ శశికళ చుడీదార్‌లో ఫోటోకు ఫోజిచ్చింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఆమె ప్రవర్త సత్ప్రవర్తన కారణంగా ఆమెని ముందుగానే జైలు నుంచి విడుదల చేస్తారని అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఈ ఫొటోతో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది అని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ ఫోటో ఎవరు లీక్ చేశారు? ఎందుకు చేశారు అనేది తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: