రోజు రోజుకి ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి తనం పెరిగిపోతున్న విషయం తెలిసిందె,దీనికి సరైన మార్గం చూపించడానికి   ప్రభుత్వ సిబ్బందిలో అవినీతి ఏమాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తరచూ ప్రకటిస్తున్నారు. నవీన్‌ పట్నాయక్‌ కేవలం మాటలు మాత్రమే చెప్పుకొచ్చారు అనుకొంటే తప్పు మాటల్లోనే కాదు చేతల్లో కూడా  చూపించారు .


అవినీతికి పాల్పడే అవినీతిపరులకు దగిన శాస్త్రి  చేసారు . ఇటీవల   తాజాగా అవినీతికి పాల్పడిన 11 మంది ప్రభుత్వ సిబ్బందిలకు  వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టారు. వారిలో ఆరుగురిని విధుల నుంచి తక్షణమే బహిష్కరించారు. మరో ఐదుగురు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్‌ నిలిపివేశారు. వీరందరికీ వ్యతిరేకంగా రాష్ట్ర విజిలెన్స్‌ విభాగం దాఖలు చేసిన దర్యాప్తు నివేదిక ఆధారంగా వీరిపై  చర్యలు చేపట్టారు. 


ముఖ్యమంత్రి ఉత్తర్వుల మేరకు విజిలెన్స్‌ విభాగం నివేదికను కార్యాచరణలో పెట్టారు. అవినీతి ఆరోపణల ఆధారంతో ముగ్గురు ఒడిశా అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు (ఓఏఎస్‌), ఇద్దరు  ఇంజినీర్ల పింఛన్‌ నిలిపివేశారు. ఒడిశా అడ్మినిస్ట్రేటివ్‌ అధికారుల్లో నవీన్‌ సేతు, సనాతన్‌ శెట్టి, పురంధర పూజారి ఉన్నారు. నిరంజన్‌ జెనా, పీతాంబర ప్రతిహారి కూడా ఇంజినీర్ల జాబితాలో ఉన్నారు.దీనితో ప్రభుత్వ సిబ్బందిలో పని చేసే ప్రతి ఒక్క అవినీతిపరులు భయబ్రాంతులతో వున్నారు .


అవినీతి ఆరోపణలకు గురైన వారికి వ్యతిరేకంగా విచారణ, దర్యాప్తు 2 నెలల స్వల్ప వ్యవధిలో ముగించి ఇప్పటి వరకు 44 మంది ప్రభుత్వ సిబ్బందిని ఉద్యోగాల నుంచి బహిష్కరించారు. మరో 10 మందికి అనివార్య ఉద్యోగ విరామం మంజూరు చేశారు. 11 మంది విరామం పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల పింఛన్‌ నిలిపివేశారు. దింతో  నవీన్‌ పట్నాయక్‌ అవినీతిపరుల పై తగిన చర్యలు తిసుకుంటున్నారు .ఇప్పటికైనా అవినీతిని  నిలిపివేస్తారని ఆసిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: