తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 31 వ రోజుకు చేరుకుంది. అయితే తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. కానీ వైపు కేసీఆర్ మాత్రం ఆర్టీసీ సమ్మె మొదలై  31 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ప్రతిపక్ష పార్టీలైన బిజెపి సిపిఐ సిపిఎం పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే కోర్టులో వాదనలు జరుగుతున్నప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం ఇప్పుడు వరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు విషయంలో సానుకూలంగా స్పందించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రాత్రి  12:00 గంటల  వరకు ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులు అందరూ ఉద్యోగాల్లో  చేరాలని లేనిపక్షంలో ఉద్యోగాలు పోయినట్లేనని మరో సారి హెచ్చరించారు కేసీఆర్



 అయితే కేసీఆర్ విధించిన డెడ్ లైన్  పై ఆర్టీసీ చేసి నేతలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులను  బెదిరింపులకు గురి చేస్తూ ప్రకటనలు చేస్తే కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ సంస్థలో  30 శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉందని ఆర్టీసీని మూసి వేయాలంటే  కేంద్రం అనుమతి కావాలంటూ అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. ఇక తాజాగా వరంగల్ జిల్లాలోని హన్మకొండ లోకల్ డిపో వద్ద ఆర్టీసీ సమ్మె చేపడుతున్న కార్మికులకు సంఘీభావం తెలిపింది సిపిఐ పార్టీ. ఈ సందర్భంగా సిపిఐ నేతలు చాడా వెంకటరెడ్డి నారాయణలు ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 



 ఈ సందర్భంగా మాట్లాడిన సిపిఐ నేత నారాయణ కెసిఆర్ తీరుపై  విమర్శలు గుప్పించారు. సమ్మె మొదలైనప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమైన అంటూ కేసీఆర్ చెబుతున్నారని... అసలు కార్మికులు చేపట్టిన సమ్మె ఎలా ఇల్లీగల్ అని  చెబుతారని కేసీఆర్ ను  ప్రశ్నించారు నారాయణ . అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ డిమాండ్ల పరిష్కారం విషయంలో మొండి వైఖరిని వ్యవహరిస్తున్నారని... కెసిఆర్ తీరు మార్చుకుని ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా... ఆల్రెడీ చెల్లించామంటూ  కేసీఆర్ మాయ చేస్తున్నారని  సిపిఐ నేత నారాయణ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. కెసిఆర్ బెదిరింపులకు భయపడమని  ... సమ్మెను యాధాతదంగా  కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: