గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విషయం లో టీఆర్ఎస్ పార్టీ వైఖరి చుసిన మీడియా సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అలాగే ఒక విలేకరి అడిగిన తెరాస పార్టీ కి  ఓనర్లు ఎవరని మరియు కెసిఆర్ తరువాత తెరాస పార్టీ మనుగడ ఏంటీ అని ఎవరు తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్..? లేదా హరీష్ రావు...? అని అడిగిన ప్రశ్నలకు గతంలో మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. 

అలాగే అతడు పార్టీ ని వీడుతున్నారని బీజేపీ లో కలుస్తున్నారని వార్తలు హల్చల్ చేసాయి. అప్పుడు ఈటల చేసిన ఆ వ్యాఖ్యలు అనేక వేదికలపై చర్చకు దారితీయడమే కాకుండా అదో వివాదానికి కారణమయ్యాయి. అదేవిదంగా తాజాగా మరో మంత్రి నోట టీఆర్ఎస్ పార్టీ ఓనర్‌ ఎవరు అనే  వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు ఎవరనే విషయంలోతన ధోరణి లో సమాధానమిచ్చారు సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెరాస పార్టీ కేసీఆర్‌దో, లేక కేటీఆర్‌దో కాదు అని పార్టీ లో ఎవరైతే కస్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త దీనికి ఓనెరే అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

పార్టీలో కేసీఆర్ ఒక్కడే నాయకుడని, మిగతావాళ్లంతా కార్యకర్తలే అని వ్యాఖ్యానించాడు.   ఈ సందర్భంగా తెలంగాణ రైతులకు మరియు పేద బిక్కి వాళ్లకు  సీఎం కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు సేవలు మరువలేనివని కొనియాడారు.  రైతుల పంటలకు భారీగా కనీస మద్ధతు ధర కల్పించడం, 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం, కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అన్నదాతకు ఏడాదికి మూడు పంటలకు నీరు అందించడం వంటివి సీఎం కేసీఆర్‌కే సాధ్యమయ్యాయని మంత్రి గంగుల చెప్పుకొచ్చారు.

ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌ పార్టీ పదవులు ఇచ్చి గౌరవం ఇస్తుందని, బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తుందని అన్నారు. దీనికి బదులిస్తూ ఒకరు శ్రీకాంత చారి తల్లి విషయం లో మీవైఖరి ఏంటీ అని అడిగిన ప్రశ్నలకు మేము ఆమెను ఆదరించి పార్టీ లో సముచిత గౌరవం ఇచ్చామని ఆమె అత్యాశకు పోయి ఎప్పుడు తెరాస ని వ్యతిరేకిస్తోందని ఆరోపించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: