తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం సమయంలో సురేశ్ ముదిరాజ్ అనే వ్యక్తి తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి నిప్పటించడంతో ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే ఒక మహిళా అధికారిని హత్యచేయడం దేశంలో ఎక్కడ జరగలేదు. కాకపోతే ఇలా ఎం‌ఆర్‌ఓల పై దాడుల సంస్కృతి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే మొదలైందనే చెప్పొచ్చు.


2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు..చాలామంది అధికారులని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగడాలకు అయితే అడ్డు అదుపు లేదు. ఇసుక మాఫియాని అడ్డుకున్న ఎం‌ఆర్‌ఓ వనజాక్షిపై చింతమనేని దాడి చేశారు. జుట్టు పట్టుకుని మరి లాగిపారేశారు. ఇంత చేసిన చంద్రబాబు ఈ ఘటన విషయంలో పెద్దగా చర్యలు తీసుకోలేదు. అందుకనే చింతమనేని ఆగడాలకు అడ్డు లేకుండా పోయాయి.


కానీ జగన్ అధికారంలోకి వచ్చాక, ఓ అధికారిణిపై దౌర్జన్యం చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని జైలుకు కూడా పంపారు. ఇదే పని చంద్రబాబు చేయలేదు. ఎం‌ఆర్‌ఓపై దాడి విషయంలో చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించి చింతమనేనిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే మిగతా వారికి బుద్ధి వచ్చేది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనువిప్పు కలిగేది. నేడు ఇలాంటి దారుణాలు కూడా జరిగేవి కాదు.


అందుకే ఇప్పుడు తెలంగాణలో విజయారెడ్డి హత్య విషయంలో చంద్రబాబే పరోక్షంగా కారణమని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి వనజాక్షిపై చింతమనేని దాడినే ఉదాహరణగా చూపిస్తున్నారు. తెలంగాణలో కూడా ఆమె హత్య వెనుక అధికార పార్టీకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయారెడ్డి హత్యకు చంద్రబాబు పరోక్షంగా కారణమయ్యార‌న్న‌దే ఇప్పుడు మ‌ళ్లీ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.    



మరింత సమాచారం తెలుసుకోండి: