ఆ మద్యకాలంలో మనుషులు బిజీ లైఫ్‌కు అలవాటు పడి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక ఉద్యోగాలు చేసేవారి సంగతైతే చెప్పక్కర్లేదు. తమ విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సరికి డీలాపడి పోతున్నారు. ఆ సమయంలో ఆకలేసి ఏదైనా తిందామంటే తయారు చేసుకునే ఓపిక కూడా ఉండటం లేదు. అందుకే ఆన్‌లైన్ లో ఆర్డర్ చేస్తే క్షణంలో వస్తుంది కాబట్టి ఈ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు.


ఇకపోతే ఈ మధ్యకాలంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ చేసే కొన్ని కొన్ని అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాక కొంతమంది భయంగానే జాగ్రత్త పడుతున్నారు. కాని డెలివరీ బాయ్స్‌లో అందర్ని నమ్మాలని ఏం లేదు. ఈ డెలివరీ ముసుగులో కొందరు కొందరు అత్యాచారాలకు , దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు. అవే గాక ఇప్పుడు కొత్తగా మరో డెలివరీ బాయ్ కస్టమర్‌కు చుక్కలు చూపించాడు. అసలేం జరిగిందో తెలుసుకుంటే చెన్నైలోని అశోక్ నగర్‌లో నివసిస్తున్న ఆర్.బాలాజీ ఓ ఫుడ్ డెలవరీ యాప్ ద్వారా ఆహారం ఆర్డర్ చేయగా. డి.రాజేష్ ఖన్నా అనే డెలివరీ బాయ్ ఆ ఫుడ్‌ను గంట ఆలస్యంగా డెలవరీ చేశాడు.


అసలే ఆకలితో నకనకలాడుతున్న అతను ఈ ఘటనపై సంబంధిత యాప్‌ నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా బాలాజీకి, రాజేష్‌కు మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ గొడవకాస్త తీవ్రస్దాయికి చేరుకోగా ఖన్నా తన తోటి డెలవరీ బాయ్స్‌కు ఫోన్ చేసి అతనున్న చోటుకు వారిని రప్పించగా వారందరు కలసి బాలాజీపై దాడి చేశారు. దీంతో బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా వారు చేసిన దాడిలో తన బంగారు గొలుసు కూడా పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఈ సంఘటనపై సంబంధిత యాప్ స్పందించాల్సి ఉంది. ఇకపో ఈ సంగతి తెలిసిన కస్టమర్లు ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే భయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: