నిన్న జరిగిన అబ్దుల్లాపూర్ తహసీల్దార్ మరణం వెనక ఉన్న అన్ని వైపులనుండి విచారను కొనసాగిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న భూవివాదాల నేతృత్వం లో గౌడెల్లి  పరిధిలోని కొన్ని వందల ఎకరాల భూమి విషయం లో మొదలైన వివాదం  భూమిపై ఓ స్థిరాస్తి వ్యాపారి కన్ను పడిందని, అధికార రాజకీయ ప్రతినిధి కూడా సాయంతో ఆ భూములను ఆ వ్యాపారి కి ముట్టజెప్పడానికి ముడుపులు తీసుకున్నారని  తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ భూములను విక్రయించాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారని, ఈ క్రమంలో విసిగిపోయిన రైతులు తహసీల్దార్‌పై దాడికి దిగి ఉంటారని  చెబుతున్నారు

. నిజానికి నిందితుడుసురేష్ తహసీల్దార్ కార్యాలయానికి ఇంతకు ముందు వెళ్లలేదని  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వివాదంలో ఉన్న భూమికి సంబంధించి సురేశ్‌కు అసలు అవగాహనే లేదంటున్నారు. మతిస్థిమితం లేని సురేశ్‌ ఎవరైనా రెచ్చగొట్టగానే రెచ్చిపోతాడని, అతడి బలహీనతను ఎవరో ఇలా వాడుకుని ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇదంతా ఎవరో కావాలనే చేయించారని నిందితుడు సురేశ్ తల్లి కూర పద్మ పేర్కొంది.

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేయడానికి ముందు నిందితుడు సురేశ్ పలుమార్లు ఆయన పెదనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఘటన వెనక ఆయనే  ఉన్నారా? అన్నఅనుమానం తో  విచారణ ప్రారంభించారు. నిజానికి అతడిని పంపింది ఆమెను చంపమని కాదని కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే కిరోసిన్ తో నేను తగలబెట్టుకుంటాను అని బెదిరించమమని చెప్పినట్లు తెలుస్తుంది.

కానీ సురేష్ మతిస్థిమితం బాగా లేకనే ఆమెపైన ఎంతటి అఘాయిత్యానికి వోడి గట్టడాని ప్రధమ విచారణలో తేలింది అని పోలీసులు వివరించారు అలాగే విచారణలో చాల మంది పెద్దల మరియు రాజకీయనాయకుల,ప్రజాప్రతినిధుల   హస్తం  కూడా ఉన్నట్లు వివరించారు దీనికి సహకరించిన అందరిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: