చెన్నైలో జరిగిన ఈ సంఘటన ముగ్గురు స్విగ్గీ డెలివరీ బాయ్స్ ను జైలుపాలు చేసింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గి లో భోజనం ఆర్డర్ చేసిన ఒక వ్యక్తిని స్విగ్గి డెలివరీ బాయ్ తన సహచరులతో కలిసి కొట్టిన ఉదంతం చెన్నైలో వెలుగు చూసింది. దీనికి కారణం ఆర్డర్ చేసిన కస్టమర్ ఫుడ్ డెలివరీ లేట్ అయిందని కంప్లైంట్ చేశాడని. దాంతో కోపం వచ్చి డెలివరీ బాయ్ కస్టమర్ తో గొడవ పడ్డాడు.

వివరాల్లోకి వెళితే పోలీస్ రిపోర్ట్ ప్రకారం బాలాజీ (42 సం") స్విగ్గి యాప్ నుంచి ఆదివారం రోజు రాత్రి 8 గంటలకు భోజనం ఆర్డర్ చేశాడు. ఫుడ్ ఆర్డర్ చేసి చాలా సేపు అయినా కూడా చేసిన ఆర్డర్ ఇంకా రాకపోగా... స్విగ్గి కస్టమర్ కేర్ కు కాల్ చేసి కంప్లైంట్ చేశాడు. దాని తర్వాత ఒక గంట తరువాత స్విగ్గి డెలివరీ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఫుడ్ డెలివరీ చేశాడు. సాలిగ్రామం లో ఉండే రాజేష్ ఖన్నా 20 సంవత్సరాల స్విగ్గి ఏజెంట్ అయిన ఫుడ్ డెలివరీ బాయ్ తో వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం పెద్దదికాగా రాజేష్ తానున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఇతర డెలివరీ ఏజెంట్లను  పిలిచి కస్టమర్ ను కొట్టారు. అయితే స్విగ్గి డెలివరీ బాయ్స్ కస్టమర్ తాగి తమతో గొడవకు దిగాడని చెబుతున్నారు.

రాజేష్ ఖన్నా డెలివరీ చేయడానికి తన తండ్రి ధనసేకరం ను కూడా వెంటబెట్టుకుని వెళ్లడంతో పోలీసులు అతనిని కూడా జైళ్లో వేశారు. రాజేష్ ఖన్నా ఆఫీస్ లో చేరి మూడు నెలలు అవుతోంది. అలాగే తోటి డెలివరీ బాయ్స్ లొ ఒకరైన శ్రీనివాసన్ అనే అబ్బాయి అక్కడే ఉన్న నందనం అనే కాలేజీలో లో ఉన్నాడు. మిగతా ఇద్దరు సూర్య మరియు మతియాలగం డెలివరీ బాయ్స్ స్విగ్గి లో చేరి 4 నెలలు అవుతుంది.

ఇదంతా ఇలా ఉండగా ఇదే గొడవలో తన బంగారూ చైన్ ఎక్కడో పోయింది అంటూ కష్టమర్ కంప్లైంట్ చేసాడు. మొత్తం తతంగాన్ని ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: