ఈ నెల 14 నుంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ మేకప్ వేసుకోనున్నారు. బాలివుడ్ సినిమా పింక్‌ను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు పవన్. అందుకు తగిన విధంగా నిర్మాతలు ఇప్పుడు హీరోయిన్లను ఎంపిక చేసే పనిలో పడ్డారు. మళ్ళీ కెమెరా యాక్షన్ అంటూ తన ఫీల్డ్ కి తాను వెళ్ళడానికి ఆయన సిద్దం కావడంపై పవన్ అభిమానులు కాస్త ఖుషీగానే ఉన్నారు. మరి సినిమా ప్రాక్టీసొ లేక మరొకటో తెలియదు గాని గత వార౦ రోజుల నుంచి ఆయన మీడియాలో హడావుడి చేస్తున్నారు. తన సినిమా దృష్టి నుంచి కొందరిని మరల్చడానికో ఏమో తెలియదు గాని ఆయన దూకుడు పెంచారు.


అదంతా బాగానే ఉంది గాని... సినిమా దర్శకుడి పర్యవేక్షణ‌లో నటన చేసే ముందు... రాజకీయాల్లో తన సీనియర్ దర్శకుడి... పర్యవేక్షణలో పవన్ అమితంగా నటిస్తున్నారు. అన్నీ సింగల్ టేక్ డైలాగులతో సినిమాలను మరిపిస్తున్నారు ఆయన. గత నాలుగు రోజుల మీడియాలో కనపడటం, తన సామాజిక వర్గం, తన అభిమానులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటనలు చేయడం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.


సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మంగళవారం కూడా మరో ఆత్మీయ సమావేశంలో పాల్గొని విమర్శలు చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన విధంగా ప్రచారం చేసుకుని... అజేయంగా ఒక్క సీటులో గెలిచిన పవన్ కళ్యాణ్... అప్పుడు జగన్ ని తిట్టారు. ఇప్పుడు జగన్ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఉపాధి లేని కూలీలను ఆదుకోమని కోరడం మానేసి ఇసుక లేకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బాబు గారు చేస్తున్న వ్యాఖ్యలనే మళ్ళీ మళ్ళీ జనాలకు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ బాబు.


ఇక పరోక్షంగా తనను దత్తత తీసుకున్న చంద్రబాబు భజన చేయడం కొసమెరుపు. వీళ్లు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ఏపీ ప్ర‌జ‌లు ఎంత మాత్రం ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఏది ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు మాత్రం వినోదాన్ని పంచుతున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: