ప్రభుత్వం తరఫున మెరిట్ విద్యార్థులకు ఇచ్చే 'ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారం' ను 'వైయస్సార్ విద్యా పురస్కారం' గా పేరు మార్చినట్టు జీవోను పాస్ చేసిన కొన్ని గంటల్లోనే మళ్ళీ తిరిగి అబ్దుల్ కలాం గారి పేరు మీదనే ఆ పురస్కారాన్నీ కొనసాగిస్తున్నట్టుగా వైయస్సార్ ప్రభుత్వం తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో టిడిపి ప్రభుత్వం ఇదే అదనుగా చేసుకొని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న వైయస్ జగన్ వెంటనే స్పందించి ఈ చర్యకు కారణమైన విద్యాశాఖ అధికారులపై సీరియస్ అయ్యారు.

మెరిట్ స్టూడెంట్ లకు అందించే అవార్డు పై అబ్దుల్ కలాం గారి పేరును తొలగించే విషయాన్ని అసలు తన దాకా తీసుకొనిరాకుండా... తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా జీవో పాస్ చేస్తారంటూ గట్టి గట్టిగా అధికారులపై వైఎస్ జగన్ అరిచి వెంటనే పేరు మార్చాలని ఆదేశించాడంట. ఇక నుంచి ఇలాంటివి చేసే ముందు దేశం కోసం పాటుపడిన నాయకులు గాంధీ, అంబేద్కర్, జ్యోతిరావు పూలే లాంటి వారి పేర్లను పరిగణలోకి తీసుకోవాలని కూడా అన్నాడట.

విద్యాశాఖ సెక్రెటరీ అయిన బి విజయ్ కుమార్ ప్రభుత్వ పాలసీ స్కీమ్ లు అన్నింటికి వైయస్ జగన్ తండ్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టినట్టుగానే తాను కూడా మెరిట్ స్టూడెంట్ లకు ఇచ్చే అవార్డులు ఆయన పేరుతోనే మార్చి జీవో నెంబర్ 78 ను సోమవారం నాడు వదలడం పెద్ద చర్చనీయాంశమైంది.

ఈరోజు ఉదయం నుండి టిడిపి నాయకులు సామాజిక మాధ్యమాల్లో  'వైయస్సార్ ఇన్సల్ట్స్ అబ్దుల్ కలాం' అనే హ్యాష్ టాగ్ ల తో రచ్చ చేస్తున్నారు. అలాగే ఎందుకు అబ్దుల్ కలాం గారి పేరు తీసేసి వైయస్సార్ పేరును చేర్చారని ప్రశ్నిస్తున్నారు. నెటిజన్లు కూడా అబ్దుల్ కలాం గారి పేరును తీయడం పై తీవ్ర అభ్యంతరలను వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: