జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై కారణం లేని విమర్శలు చేయడం తగదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విశాఖలో జనసేన నాయకులు, కార్యకర్తలతో జరిగిన జరిగిన సమీక్షలో ఆయన జగన్ పై పలు వివాదాస్పద వాఖ్యలు చేశారు. సీఎం జగన్ రాష్ట్ర రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయమని ఆయనకు కోర్టు ఖర్చులు తగ్గుతాయని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కర్నూలులో కోర్టు పెడితే పులివెందుల నుంచి వెళ్లిరావడం సులువుగా ఉంటుందని వ్యంగ్యంగా అన్నారు. సమీక్షలో నియజకవర్గ సమస్యలు జనసేన బలోపేతంపై చర్చ తక్కువ జగన్ మీద ఫోకస్ ఎక్కువ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. 

 

 

జగన్ పై పవన్ కళ్యాణ్ చేసే విమర్శలు వ్యక్తిగత దూషణగా మారుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా జగన్ ను విమర్శిస్తూ వ్యక్తిగతంగా వెళుతున్నారు. ప్రభుత్వ పాలన ఎవరు చేస్తున్నా ప్రతిపక్షంలో ఉన్నవారు విమర్శలు చేయడం సహజమే. కానీ అదేపనిగా వ్యక్తిగత విమర్శలు చేయడం ఏం రాజకీయ నీతి  అని పలువురు అంటున్నారు. పవన్ గతంలో రైల్వే జోన్ కోసం విశాఖలో చేపట్టిన ర్యాలీకి చంద్రబాబు మద్దతివ్వని విషయాన్ని కొందరు ప్రస్తావిస్తూ.. నేడు అదే విశాఖలో పవన్ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి టీడీపీ ఎలా మద్దతు ఇచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టాక తనను పక్కన పెట్టిన విషయాన్ని పవన్ మర్చిపోయాడా అనే విమర్శలూ వస్తున్నాయి. 

 

 

రాజధాని రైతులు, భవన నిర్మాణ కార్మికులు పవన్ ను ఆశ్రయిస్తే ఏదొక స్టేట్ మెంట్ తో అటెన్షన్ క్రియేట్ చేయాలని టీడీపీ భావిస్తోందనే వాదనా లేకపోలేదు. దీంతో వైసీపీ - జనసేన మధ్య కొట్లాటను టీడీపీ ప్రజల్లో వాడుకుంటోందని అంటున్నారు. పవన్ ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ బాబు మాదిరిగానే జగన్ ను టార్గెట్ చేస్తున్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: