కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. కేసీఆర్ గెలుపుకు కార్మికుల మద్దతు ఉందన్న ఆజాద్ కార్మికుల సమస్య తీర్చాల్సిన అవసరం కేసీఆర్ పై ఉందని అన్నారు. ఢిల్లీ పత్రికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి ప్రముఖంగా వార్తలు వస్తున్నాయని ఆజాద్ అన్నారు. 20 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోవడం దారుణమని ఆజాద్ వ్యాఖ్యానించారు. 
 
50,000 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అని గులాంనబీ ఆజాద్ అన్నారు.  టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు.  సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆజాద్ అన్నారు. విజయారెడ్డి హత్య గురించి ఆజాద్ మాట్లాడుతూ విజయారెడ్డి హత్య హేయమైన చర్య అని అన్నారు. అన్ని రంగాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆజాద్ అన్నారు. 
 
దేశంలో నిరుద్యోగ సమస్య సవాల్ గా మారిందని రైతులకు మద్దతు ధర లభించటం లేదని అన్నారు. భారతదేశ నిరుద్యోగ సమస్య ప్రపంచ సగటులో రెండింతలు అధికంగా ఉందని ఆజాద్ అన్నారు. ఆందోళనకరంగా భారతదేశ ఆర్థికవ్యవస్థ ఉందని అన్నారు. 15 లక్షలు మోడీ పేద ప్రజల ఖాతాల్లో వేస్తానన్న హామీని నెరవేర్చలేదని అన్నారు. బీజేపీ పాలనలో దేశ స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోయిందని అన్నారు. 
 
18 శాతం పన్నులు పురుగుమందులపై మోపి రైతుల మీద భారం మోడీ మోపుతున్నారని ఆజాద్ అన్నారు. కేంద్రం 13 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్, డీజిల్ పై పన్నులు వేయటం ద్వారా భారం వేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విజయారెడ్డి హత్యలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం శాంతినెలకొనదని అన్నారు, 



మరింత సమాచారం తెలుసుకోండి: