మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్న ఆటగాడు.తనదైన  ప్రణాళికలు వ్యూహాలతో ఇండియాకి ఎన్నో విజయాలు అందించిన ఆటగాడు ఎంఎస్ ధోని. ధోనికి అభిమానుల్లో ప్రత్యేకమైన  క్రేజ్  ఉంటుంది. అందుకే ధోనీ మైదానంలోకి అడుగు పెట్టాడు అంటే  చాలు... ధోనీ ధోనీ అంటూ నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ధోనీ బ్యాటు పడితే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ధోనీ బ్యాట్ పట్టి  సొగసైన హెలికాప్టర్ షాట్ లు  కొడుతుంటే సగటు క్రికెట్ ప్రేక్షకుడి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నో ఏళ్ల పాటు టీమిండియా కి కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించటమే కాదు...  2 ప్రపంచ కప్లో అందించాడు మహేంద్రసింగ్ ధోని. టీమిండియాకు ఎన్నో ఏళ్ల నుంచి అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్ ను  చివరికి తన సారధ్యంలో అందించాడు ధోని . 

 

 

 

 అయితే గత కొంతకాలంగా ధోని క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా గత కొంతకాలంగా ధోని ఉన్నతస్థాయి ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు ... ప్రతి మ్యాచ్ లో  పేలవ ప్రదర్శన చేస్తున్నప్పటికీ ధోనికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ లో కూడా పేలవ ప్రదర్శనతో అందరి విమర్శలకు గురయ్యాడు . దీంతో ధోనీ రిటైర్ అవుతాడా అని ఎన్నో రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అటు కొంతమంది మాజీ క్రికెటర్లు సైతం ధోనీ రిటైర్ అయితే బాగుంటుందని భావిస్తున్నారు. కాగా  ప్రపంచ కప్  ముగిసిన తర్వాత క్రికెట్ కు  దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత్ బంగ్లాదేశ్ల మధ్య జరిగే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో కొత్త అవతారం ఎత్తుతున్నారు. భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్లో ధోనీ కామెంటేటర్ గా నిర్వహించబోతున్నారు. 

 

 

 

 నవంబరు 22న జరిగే  భారత్ బంగ్లాదేశ్ల మధ్య డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కోల్ కత్తా  ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభం కానుంది. డే అండ్  నైట్ పద్ధతిలో ఈ టెస్ట్ మ్యాచ్  నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ కి ధోని కామెంటర్ గా వ్యవహరించబోతున్నారు . మ్యాచ్ ప్రచారకర్త స్టార్ ఇండియా బ్రాడ్ కాస్టింగ్ సంస్థ కామెంట్రీ బాక్స్ ను  భారత మాజీ టెస్ట్ కెప్టెన్ లతో కామెంటరీ బాక్స్ ని నింపి  వేయాలని నిర్ణయించింది. ధోని సహా మాజీ టెస్టు సారథులు అందరూ ఈ టెస్టులో తొలి రెండు రోజులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించ బోతున్నారు. అంతేకాదు ఆ చివరి రెండు రోజులు ఆట విరామ సమయంలో ఈ మాజీ లతా మైదానంలోకి అడుగుపెట్టింది క్రికెట్ ఆడనున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: