పవన్ కల్యాణ్ ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల ద్వారా సంపాదించుకున్న క్రేజ్....పవన్ రాజకీయాల్లోకి వచ్చిన కొనసాగింది. గత అయిదేళ్లుగా పవన్ మీటింగ్లు పెట్టే ప్రతిచోటా అర్ధమైంది. ఆయన ఎక్కడ ఉంటే విపరీతంగా అభిమానులు, కార్యకర్తలు వేలమంది తరలి వచ్చారు. ముఖ్యంగా యువత పవన్ సభల్లో బాగా సందడి చేశారు. దీంతో ఏపీ యువత ఎక్కువ శాతం తనవైపే ఉందని పవన్ భావించారు.


ఆ భరోసాతోనే తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. కానీ ఘోరతి ఘోరంగా ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన రెండు  చోట్ల ఓడిపోయారు. అటు పార్టీ కూడా ఒక సీటుకే పరిమితమైంది. అయితే పవన్ సభలకు హాజరైన యువత ఎక్కువ శాతం జనసేనకు ఓటు వేయలేదని అప్పుడే తెలిసిపోయింది. ఏదో పవన్ సామాజికవర్గం యువత కొంతవరకు జనసేన వైపు మొగ్గు చూపారు గానీ...మిగతా వారు అంతా జగన్ వైపు వెళ్ళిపోయారు. ఏపీలో అత్యధిక శాతం యువత వైసీపీకే ఓటు వేశారు. అందుకే వైసీపీ అన్ని సీట్లు గెలుచుకోగలిగింది.


ఇక ఇదే విషయం ఈ మధ్య పవన్ కూడా తెలుసుకున్నారు. కాకపోతే ఇప్పటికీ పవన్ సభలకు హాజరవుతున్నారు. కానీ వీరిలో తమ పార్టీకి ఎక్కువ మంది ఓటు వేయలేదని పవన్ బహిరంగంగానే కామెంట్ చేశారు. తన సభలకు వచ్చే యువతలో కనీసం 70 శాతం తమకు ఓట్లు వేసి ఉంటే, 70 సీట్లు అయిన సాధించే వాళ్ళమని పవన్ వ్యాఖ్యానించారు. కానీ వాళ్ళు ఓటు వేయకపోయిన వాళ్ళ కోసం పోరాడుతున్నానని పవన్ చెప్పారు.


ఇక పవన్ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే....తన సభలకొచ్చే వారు పెద్దగా ఓటు వేయలేదని అర్ధం చేసుకున్నారు. అదే టైంలో యువ‌త‌లో త‌న‌కంటే జ‌గ‌న్‌కు చాలా క్రేజ్ ఉంద‌న్న విష‌యం కూడా తెలిసొచ్చిన‌ట్టే ఉంది. మొత్తానికి పవన్ కు ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. ఏదేమైనా సినిమాలు వేరు, రాజకీయాలు వేరనే చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: