టీడీపీ అధినేత చంద్రబాబు సమయాన్ని బట్టి రాజకీయాన్ని మార్చేయగల నేత. సమయం, అవసరం బట్టి అప్పటికప్పుడు రాజకీయం నడుపుతారు. దానికి చాలానే ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే ఎన్నికల ముందు సీబీఐని రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వని బాబు...ఓడిపోయాక మాత్రం సీబీఐ కావాలని మాట్లాడారు. ఇలా డబుల్ స్టాండ్ తీసుకోవడం బాబుకు అలవాటు అనే చెప్పాలి. ఇక బాబుకు తగ్గట్టుగానే ఆ పార్టీ నేతలు కూడా నడుస్తారు.


తాజాగా సి‌ఎస్ ఎల్‌వి సుబ్రహ్మణం బదిలీలో కూడా టీడీపీ రాజకీయం చేసింది. ఎన్నికల ముందు ఎల్‌విపై ఒంటికాలి మీద లేచిన బాబు అండ్ కొ...ఇప్పుడు ఆయనపై సానుభూతి చూపిస్తున్నారు. అస్సలు ఆల్ ఇండియా సర్వీసెస్‌లో పనిచేసేవారిని సాధారణ ఉద్యోగిగా బదిలీ చేయడం ఏంటని బాబు ప్రశ్నిస్తున్నారు. సీఎస్‌ను క్లర్క్ కంటే హీనంగా బదిలీ చేస్తారా? అంటూ ఓ ఫైర్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు ఇంతలా ఎల్‌విపై సానుభూతి చూపిస్తున్న బాబు...ఎన్నికల ముందు ఎలాంటి వైరం కొనసాగించారో చూశాం కూడా.


ఎన్నికల కోడ్ రాగానే అప్పటి సి‌ఎస్ అనిల్ చంద్ర పూనేఠాని తప్పించి ఎన్నికల సంఘం ఎల్‌విని నియమించింది. అప్పటి నుంచి బాబు-ఎల్‌వికి మధ్య కోల్డ్ వార్ తీవ్ర స్థాయిలో నడిచింది. అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కోరిన కొన్ని కీలకమైన జీవోలను విడుదల చేయడానికి సుబ్రహ్మణ్యం నిరాకరించారు. పైగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రను బదిలీ చేశారు. ఆ శాఖను తన పరిధిలోకి తీసుకున్నారు.


ఇలాంటి చర్యలు చంద్రబాబుకూ, ఎల్వీకీ మధ్య అగాధాన్ని సృష్టించాయి. అలాగే ఆ సమయంలో ఎల్‌వి జగన్ మనిషి అని పసుపు తమ్ముళ్ళు తెగ గోల పెట్టేశారు. ఇక ఎన్నికలు తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కూడా జగన్...ఎల్‌విని సి‌ఎస్ గా కొనసాగించారు. కానీ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాలు వల్ల జగన్ ప్రభుత్వం ఎల్‌విని బదిలీ చేశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని బాబు బ్యాచ్ రాజకీయం చేస్తూ డబుల్ గేమ్ ఆడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: