సాధారణంగా ఏ ప్రభుత్వమైన తప్పులు చేస్తే వాటిని నిజాయితీగా ఒప్పుకుని సరిద్దడం చాలా అరుదుగా చూస్తాం. ఏ అధికార పార్టీ కూడా తాము చేసిన తప్పులని ఒప్పుకోదు. పైగా తప్పులని ఎత్తిచూపే వారిపై ఎదురు దాడి చేస్తుంది. కానీ ఏపీలో ప్రస్తుత జగన్ ప్రభుత్వం మాత్రం అలా లేదు. ముఖ్యంగా సీఎం జగన్ ప్రజలకు మేలు చేసే పథకాలు ఇస్తూనే....కొన్ని నిర్ణయాలు వల్ల వారు ఇబ్బంది పడితే నిజాయితీగా ఒప్పుకుని వాటిని సరిదిద్దుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సరికొత్త నిర్ణయాలు, మంచి పథకాలని తీసుకొచ్చారు.


ఈ క్రమంలో గత టీడీపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిందని, ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. దీని వల్ల నిర్మాణాలు ఆగిపోయి చాలామంది కూలిలు ఇబ్బందులు పడ్డారు. దాంతో కొత్త పాలసీని వెంటనే తీసుకొచ్చారు. అప్పటికి ఇసుక పూర్తిగా లభ్యం కాలేదు. పైగా నదుల్లో వరదలు ఉండటంతో ఇసుక తవ్వకాలు కుదరలేదు. అయితే ఈ విషయాన్ని జగన్ గమనించారు.


తప్పు ఒప్పుకుని త్వరలోనే ఇసుకని పూర్తిగా అందించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇసుక ఎక్కువగా అందించాలని వారోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదేగాక జగన్ కొన్ని విషయాల్లో నిజాయితీగా వ్యవహరించారు. ఓ ప్రభుత్వ అధికారిణిని బెదరించారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే జైలుకు పంపారు. అలాగే గ్రామ సచివాలయాలకు రంగులు వేసే భాగంలో అనంతపురం జిల్లాలో కొందరు గోడకు ఉన్న జాతీయ జెండాకు రంగు వేసేశారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ వెంటనే ఆ స్థానిక అధికారిపై చర్యలు తీసుకుని, మళ్ళీ జాతీయజెండాని పునరుద్ధించారు.


ఇక తాజాగా కూడా పదవ తరగతి విద్యార్ధులకు అందించే పురస్కారాలకు అబ్దుల్ కలామ్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టారు. జగన్ కు తెలియకుండానే అధికారులు ఇలా నిర్ణయం తీసుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న జగన్ వెంటనే స్పందించి అధికారులని మందలించి అబ్దుల్ కలామ్ పేరునే కొనసాగించాలని సూచించారు. ఈ విధంగా అనేక సందర్భాల్లో జగన్ తప్పులని ఒప్పుకుని, వాటిని సరిదిద్ది తన నిజాయితీని చాటుకున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: