పశ్చిమ బెంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే దిలీప్ ఘోష్ గోప అష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో స్వదేశీ, విదేశీ గోవులను వర్ణిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.భారతదేశానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడి సమాజం, సంసృతి, కట్టుబాట్లను విదేశీయులు ఎంతో గౌరవిస్తారని దిలీప్ ఘోష్ గుర్తు చేశారు.


"పాశ్చాత్య ఆవులు అసలు గోవులే కాదని...అవి ఓ రకమైన జంతువులు మాత్రమేనని అన్నారు. విదేశీ ఆవులు మన గోమాతలు కావు, అవి కేవలం ఆంటీలు మాత్రమే అంటూ .స్వదేశీ ఆవులు అమ్మలాంటివి.. అవి బంగారు పాలనిస్తాయి. ఆ పాలల్లో బంగారం కలిసి ఉంటుంది. అందుకే దేశీయ ఆవు పాలు బంగారు వర్ణంలో ఉంటాయి.మనం ఆ పాలను తాగితే ఆరోగ్యంగా ఉంటాము.తల్లి పాలు తరువాత తాము గోవు పాలు తాగి బతుకుతున్నామని, గోవులు తమకు తల్లితో సమానమని దిలీప్ ఘోష్ చెప్పారు.

అందుకే తాము గో హత్యలను వ్యతిరేకిస్తున్నామని, ఎవరైనా గోవులను హత్య చేస్తే చూస్తూ ఊరుకోమని, తగిన బుద్ది చెబుతామని దిలీప్ ఘోష్ హెచ్చరించారు. పవిత్రమైన భరత భూమి మీద గోవులను చంపి, మాంసం తినడం నేరం.  కొందరు మేధావులు బహిరంగంగా ఆవు మాంసం తింటారు. మీ ఇంట్లో కుక్క మాంసం కాకుంటే ఏ జంతువుల మాంసం తిన్నా మేము వద్దని చెప్పమని, అయితే రోడ్ల మీద గోవు మాంసం తింటే సహించమని దిలీప్ ఘోష్ హెచ్చరించారు.

విదేశీ కుక్కలను ఇంట్లో పెంచుకుని వాటి మలమూత్రాలు శుభ్రం చేసి మేము చాలా గ్రేట్ అంటూ సంకలు గుద్దుకుంటున్నారని, అదే కుక్క మాంసం మీరు ఎందుకు తినడం లేదని దిలీప్ ఘోష్ ప్రశ్నించారు. అప్పుడు వాళ్ల ఆరోగ్యాలు మరీ బాగుంటాయి. 
దిలీప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మొదటిసారేమీ కాదు.. గతంలో పోలీసులను, టీఎంసీ పార్టీ నేతలను కొట్టమని భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఇప్పుడు మరోసారి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: