పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఎలాంటి స్పీచ్ అయితే ఇచ్చాడో ఇప్పుడు అదే మాదిరిగా నిన్న జరిగిన భహిరంగ సభలో మాట్లాడినారు. అదే మాదిరి ఆవేశం .. వైసీపీ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. అందరి తాట తీస్తానని చెప్పడం. పవన్ స్పీచ్ చాలా పేళవంగా ఉందని చెప్పాలి. ఎన్నికల ముందు అలా మాట్లాడి పవన్ కల్యాణ్ సాధించింది ఏమీ లేదు. ఆఖరికి తను ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయారు. జగన్ విషయంలో అనుచితంగా మాట్లాడి మరింత డ్యామేజ్ చేసుకున్నారు జనసేన అధిపతి. విశేషం ఏమిటంటే.. ఇప్పటికీ పవన్ ఏమీ మారలేదు! ప్రజా తీర్పును అయినా అవహేళన చేస్తున్నాడు కానీ తన తీరును మాత్రం పవన్ కల్యాణ్ మార్చుకోవడం లేదు.


భహిరంగ సభలో చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా వైసీపీ నాయకులనే తిట్టడానికే పీకే ఎక్కువ సమయం కేటాయించారు. అసలు సమస్యను గాలికి వదిలేశారు. తను వ్యక్తిగత విమర్శలు చేయనని చెప్పుకుంటూ.. వైసీపీ వారి విషయంలో మాత్రం మళ్లీ అవే మాటలే మాట్లాడుతూ ఉన్నాడాయన.ఆ సంగతలా ఉంటే.. తన పార్టీ జనాల్లోకి చొచ్చుకుపోయే నినాదాలు కానీ తనపై నమ్మకం కలిగే విధానాలను మాత్రం ఇప్పటికీ పవన్ కల్యాణ్ ప్రకటించలేకపోతూ ఉండటం గమనార్హం. ఇసుక మార్చ్ లో పవన్ కల్యాణ్ పేలవమైన ప్రసంగమే చేశారు.


అసలు సమస్య ఒకటి అయితే దానిని మరిచి పోయి పవన్ కళ్యాణ్ విజయ సాయి రెడ్డి అంటూ అతని మీద విరుచుకుపడ్డారు. ఆఖరికి స్టూడెంట్స్ కు సెలవు రోజును ఎంచుకుని మరీ పవన్ కల్యాణ్ తన ప్రోగ్రామ్ చేశాడనే అపవాదును ఎదుర్కొంటూ ఉన్నారు! ఇక సీఎస్ బదిలీ విషయంలో కూడా అదే పేలవమైన ప్రసంగాన్ని చేశారు పవన్ కల్యాణ్. ఇలాంటి వీక్ స్టేట్ మెంట్స్ తో పవన్ కల్యాణ్ ఎవరిలోనూ ఆసక్తిని రేకెత్తించలేకపోతూ ఉన్నాడు తను పొలిటికల్ మేలేజీని పొందలేకపోతూ ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: