అవును ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యంను అవమానకర రీతిలో తొలగించిన వైనంపై మిగిలిన ఉన్నతాధికారులు మండిపోతున్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం చీఫ్ సెక్రటరి ఎల్వీని జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా బదిలీ చేయటం అందరికీ తెలిసిందే.  మరో ఆరు నెలల్లో రిటైర్ అవబోతున్న ఎల్వీని జగన్ అవమానకర రీతిలో తొలగించారంటూ చాలామంది  ఐఏఎస్ అధికారులు బాగా గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

 

నిజానికి రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఏ ఉన్నతాధికారిని కూడా ప్రభుత్వం ఇలాగ బదిలీ చేయదు. సదరు ఉన్నతాధికారిపై అవినీతి ఆరోపణలుంటే అది వేరే సంగతి. కానీ ఎల్వీపై అటువంటి ఆరోపణలేవీ లేవన్న విషయం గుర్తించాలి. జగన్ చెప్పిన కొన్ని పనులకు లేకపోతే ఆదేశాలకు రూల్ పొజిషన్ చెప్పటంతోనే ఎల్వీపై సిఎం మండిపోయారని బాగా ప్రచారం జరుగుతోంది. కొన్ని పథకాలకు నిధుల మంజూరు విషయంలో కూడా మిగిలిన ఉన్నతాధికారులకు కూడా జగన్ తో గ్యాప్ పెరిగినట్లు సమాచారం.

 

అదే సమయంలో జగన్ తో ఎల్వీకి గ్యాప్ పెరగటానికి ప్రధాన కారణం జీఏడి ముఖ్య కార్యదర్శిగా అపాయింట్ అయిన ప్రవీణ్ ప్రకాషే కారణమని అంటున్నారు. ప్రవీణ్ కు జగన్ అమితమైన ప్రాధాన్యత ఇవ్వటంపై చాలామందికి గుర్రుగా ఉంటోంది. ఎందుకంటే జీఏడి ముఖ్య కార్యదర్శిగానే కాకుండా ప్రవీణ్ సిఎం ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు.  

 

ఒకే వ్యక్తిని  రెండు కీలకమైన పోస్టుల్లో నియమించటం మామూలుగా జరగదు. అందునా ప్రవీణ్ లాంటి వ్యక్తిత్వమున్న ఉన్నతాధికారిని అస్సలు నియమించరు. కానీ ఏపి భవన్లో పనిచేస్తున్న ప్రవీణ్  ఢిల్లీలోని బిజెపిలోని కీలక నేత సిఫారసుతోనే ఏపికి వచ్చినట్లు సమాచారం. అందుకనే అధికార యంత్రాంగానికి బాస్ అయిన  ఎల్వీని కూడా లెక్క చేయటం లేదని తెలుస్తోంది.  ఏదేమైనా తొందరలోనే రిటైర్ అవబోతున్న ఎల్వీని అవమానకర రీతిలో బదిలీ చేయటంపై చాలామంది ఐఏఎస్ ల్లో జగన్ అంటే మంటగా ఉన్నట్లు అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: