ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీని బ్రతికి౦చుకునే పనిలో పడిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి ఇప్పుడు యువనేతలు షాక్ ఇచ్చే అవకాశం ఉందా ? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర కష్టాల్లో ఉన్న నేపధ్యంలో కార్యకర్తల్లో జోష్ నింపే కార్యక్రమాలు మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు విస్తృత స్థాయి సమావేశాలు అంటూ కాస్త సందడి చేస్తూ, నవ్వుతూ ప్రసంగాలు చేస్తున్నారు. మరి దీనిపై యువనేతల అభిప్రాయం ఏ విధంగా ఉంది...? వారు బాబు గారి నాయకత్వంలో పని చేయడానికి సిద్దంగా ఉన్నారా...? అంటే చాలా మంది యువనేతల్లో ఇప్పుడు ఇదే ప్రశ్నార్ధకంగా మారింది.


తమ తండ్రులు పార్టీ కోసం నానా కష్టాలు పడి ఆస్తులు పోగొట్టుకుని, ఎన్నో పోరాటాలు చేసి రౌడీలుగా ముద్ర వేయించుకుని కష్టపడితే... ఇప్పుడు తమను కనీసం చంద్రబాబు గుర్తించడం లేదనే ఆవేదన యువనేతల్లో ఉంది. తెలుగు యువత అధ్యక్షుడుగా ఉన్న దేవినేని అవినాష్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. తండ్రి నెహ్రూ రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న ఆయనకు పెనమలూరు సీటు అడగగా చంద్రబాబు అంగీకరించలేదు. చివరకు గుడివాడ పంపడంతో బలమైన నేతగా ఉన్న కొడాలి నానీ మీద పోటీ చేసి ఓడిపోయారు.


ఇప్పుడు అవినాష్ ని బాబు పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతుంది. అలాగే పరిటాల శ్రీరాం, భూమా అఖిల ప్రియ వంటి నేతలకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదట చంద్రబాబు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చెప్పినవి అఖిల ప్రియ చేయలేదని ఇప్పుడు ఆమెను పక్కన పెట్టారని ఆ పార్టీ కార్యకర్తలే అనే పరిస్థితి ఉంది. ఇకపోతే రాయలసీమకు చెందిన యువనేతలతో పాటు, ఉత్తరాంధ్రలో ఉన్న కొందరు యువనేతలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. దీనితో సోమవారం పార్టీ మీటింగ్ కి వచ్చిన కొందరు యువనేతలు సమావేశమై... పరిస్థితి గురించి చర్చించారట. కొందరు పార్టీ మారడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: