పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుంది. వెనకటికొకడు లేస్తే మనిషినికానంటూ కాలాన్ని నెట్టుకొచ్చినట్లుంది జనసేన అధినేత పవన్ వ్యవహారం. పవన్ సామర్ధ్యమేంటో మొన్నటి ఎన్నికల్లోనే అందరికీ తెలిసిపోయింది. పోటి చేసిన రెండు చోట్లా ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై  నోటికొచ్చినట్లు మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది.

 

తనకు కోపం వస్తే భూమి బద్దలవుతుందో లేకపోతే ఆకాశానికి చిల్లు పడుతుందో అన్నట్లే ఉంది పవన్ మాటలు.  ఎంత కోపమొచ్చినా ఎవరికీ ఏమీ కాదన్న విషయం పవన్ తో సహా అందరికీ తెలుసు. అయినా పవన్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ? ఎందుకంటే చంద్రబాబునాయుడు సావాస దోషమనే చెప్పాలి. చంద్రబాబు కూడా ఇలాగే అందరినీ బెదిరిస్తు కాలాన్ని నెట్టుకొచ్చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత చంద్రబాబు కూడా అధికారులను బెదిరిస్తున్నారు. పోలీసులకు వార్నింగులిస్తున్నారు. డిజిపి, సీనియర్ ఐఏఎస్ లపై ప్రైవేటు కేసులు పెట్టి కోర్టులకు లాగుతామని హెచ్చరిస్తున్నారు. అంటే ఎన్నిరకాలుగా వీలైంత అన్ని విధాలుగాను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉడుత బెదిరింపులకు ఎవరు బెదరరు అన్నట్లుగానే పవన్ బెదిరింపులకు కూడా ఎవరు బెదరరు అన్నది వాస్తవం.

 

విశాఖపట్నంలో జరిగిన బహిరంగసభలో  ఇసుక కొరతకు పరిష్కారం గురించి తప్ప మిగిలిన చెత్తంతా మాట్లాడారు. మంత్రి కన్నబాబు గురించి మాట్లాడారు. ఇసుక సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు 2 వారాలు సమయం ఇస్తున్నట్లు వార్నింగే ఇచ్చేశారు. 2 వారాల తర్వాత ఏం చేస్తారయ్యా అంటే అమరావతి వీధుల్లో తిరుగుతారట.

 

దానికి 2 వారాలు ఎందుకు ఇపుడే తిరగచ్చు కదా ? అంటూ మంత్రులు చాలా లైటుగా తీసుకున్నారు పవన్ ను.  ప్రభుత్వానికి పవన్ ఎంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా  వైసిపి అసలు ఏమాత్రం పట్టించుకోలేదనే అర్ధమవుతోంది. పవన్ కు కోపం వస్తే ఏమవుతుంది ? ఏమీ కాదు ఎందుకంటే ఇటువంటి వాళ్ళని వైసిపి నేతలు చాలామందినే చూసుంటారు.

 

స్టేజి మీదకు ఎక్కగానే తెచ్చుపెట్టుకున్న ఆవేశంతో ఊగిపోవటం, అసలు ఏం మాట్లాడుతున్నారో కనీసం పార్టీ వాళ్ళకైనా అర్ధమవుతుందో లేదో కూడా తెలీటం లేదు. గట్టిగా రెండు రోజులు జనాల్లో తిరిగితే మళ్ళీ 20 రోజులు అడ్రస్సుండని పవన్ కూడా వైసిపి ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారంటే భలే విచిత్రంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: