గత కొన్ని రోజులుగా దేశంలో ఉల్లి హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఉల్లిపాయకు సంబంధించిన ధరలు కొండెక్కడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  గత కొంతకాలంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.  నెల రోజుల క్రితం ధరలు కాస్త మెరుగ్గా కనిపించినా.. ఆ తరువాత ధరలు మందగించాయి.  దేశంలో ఉల్లి పంట పాండే ప్రాంతాల్లో అకాలంగా వర్షాలు కురుస్తున్నాయి.  ఈ వర్షాల కారణంగా పంట నీట మునిగింది.  


పంటలు నీటిలో మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  నవంబర్ నెలలో పంట ఎప్పుడు చేతికి వస్తుంది.  కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ధరలు తిరిగి ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్నాయి.  ధరలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు.  మాములుగా మార్కెట్ లో ఉల్లి ధర రూ. 40 నుంచి రూ. 50 గా ఉంటుంది.  


కానీ, ఇపుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు.  ధరలు భారీగా పెరిగే విధంగా ఉన్నాయి.  హోల్ సేల్ మార్కెట్ లోనే రూ. 50 రూపాయలకు పైగా ఉల్లి ధర పలుకుతుంది.  ఇలా ధరలు పెరిగిపోవడంతో .. బయట మార్కెట్ లో 80 నుంచి 90 రూపాయలుగా ఉండటం విశేషం.  ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అకాలంగా వర్షాలు కురవడం వలన ఇలా జరిగినట్టు తెలుస్తోంది.  


కొంతపంట చేతికి వస్తే ధరలు అదుపులో ఉండేవి.  కానీ, పంట నీటిపాలు కావడంతో గిడ్డంగుల్లో ఉన్న ఉల్లిని కేంద్రం రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నది.  ఉల్లికి సంబంధించిన ఎగుమతులను ఇప్పటికే ప్రభుత్వం నిలిపివేసింది.  దీంతో కొన్ని రోజులపాటు ధరలు అదుపులో ఉన్నాయి.  కానీ, ఇప్పుడు క్రమంగా ఆ గిడ్డంగుల్లో ఉన్న ఉల్లి తగ్గిపోతుండంతో ఉల్లి ధరలు క్రమేపి ఆకాశాన్ని తాగుకున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: