తెలంగాణలో  ఈరోజు ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పరిష్కారం అనేది ఈరోజుతో తేలిపోనుంది. మొన్ననే కేసీఆర్ విలేకరుల సమావేశంలో ఈనెల 5వ తారీఖులోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరితే ఆర్టీసీ ఉద్యోగాలు ఉంటాయ‌ని లేదంటే మొత్తంగా ప్రైవేటీకరణ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ పెట్టిన కౌంట్ డౌన్ మొదలైంది.


ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి కేసీఆర్ గడువు విధించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పదుల సంఖ్యలో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 49వేల మందిలో ఈ సంఖ్య చాలా తక్కువ. అయితే కేసీఆర్ డెడ్ లైన్ పై ఆర్టీసీ కార్మిక సంఘాలు, నాయకులు వెనక్కి తగ్గడం లేదు. కార్మికులు కూడా సమ్మెలోనే ఉంటున్నారు. కేసీఆర్ బెదిరింపులకు లొంగకుండా విధుల్లోకి రావడం లేదు. కోర్టులు, రాజకీయ పార్టీల ద్వారా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


అయితే ఇప్పుడు ఈరోజు సమయం గడుస్తున్న కొద్ది కేసీఆర్ పంతం నెగ్గుతుందా. ? కార్మికుల పట్టుదల పనిచేస్తుందా అన్న ఉత్కంఠ యావత్ తెలంగాణలో వ్యక్తమవుతుంది. ఈరోజు కార్మికులు కనుక విధుల్లో చేరకపోతే మొత్తం ప్రైవేటీకరణ చేస్తానన్న కేసీఆర్ రేపు ఏం చేస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక మ‌రి ఈ విష‌యంలో కార్మికుల పంతం గెలుస్తుందా లేక సీఎం కేసీఆర్ పంతం నెగ్గుతుందా అని అంద‌రూ వేచి చూస్తున్నారు. ఆర్టీసీ నష్టాల్లో వాటా కోసం కేంద్రం ఎలాగో ముందుకు రాదు కాబట్టి.. ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా బీజేపీ నేతలు మాట్లాడకుండా చూడొచ్చనేది సీఎం వైఖరిలా ఉంది. మరి 31 శాతం వాటా ఉన్న కేంద్రాన్ని సంప్రదించే ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నాయా? అని ప్రశ్నిస్తే.. సమాధానం లేదనే వస్తుంది. అలాంటప్పుడు మీరు చేసిన తప్పిదాలకు మేమెలా డబ్బులు ఇవ్వాలని కేంద్రం తిరిగి ప్రశ్నించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: