జనం కోసం జననేతగా అడుగులు వేసి...అరుదైన రికార్డు సృష్టించిన ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర ప్ర‌స్థానానికి న‌వంబ‌రు 6వ తేదీతో రెండేళ్లు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారిలో ఒక భరోసా కల్పించేందుకు వైయస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని దివంగత నేత వైయస్సార్‌ సమాధి వద్ద 2017, నవంబరు 6వ తేదీన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదలుపెట్టిన ప్రస్థానానికి రెండేళ్లు పూర్తయ్యాయి.వైయస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయ వేదికగా 2017, నవంబరు 6వ తేదీన ప్రారంభమైన శ్రీ వైయస్‌ జగన్‌ సుదీర్ఘ ‘ప్రజా సంకల్ప యాత్ర’ రాష్ట్రమంతటా 13 జిల్లాలలో 341 రోజులు కొనసాగి, ఈ ఏడాది జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది.    పాదయాత చేస్తూ ప్రతి ఒక్కరిలో భరోసా కల్పించిన రాజన్న బిడ్డ, ఏడాదికి పైగా ప్రజలతో మమేకమై వారిలో ఒకరిగా మెలిగి దేశ రాజకీయాల్లోనే అరుదైన ఘట్టాన్ని నమోదు చేశారు. 

ప్రజా సంకల్ప యాత్రలో జ‌గ‌న్ ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను విన్నారు. ప్ర‌భుత్వం తీరును, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. నేను ఉన్నాను...నేను విన్నాను అని హామీ ఇచ్చారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విన‌తుల ఆధారంగానే..త‌మ పార్టీ మేనిఫెస్టో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆ మేర‌కు జ‌గ‌న్ ఇచ్చిన స్ప‌ష్ట‌మైన హామీ ప్ర‌జ‌ల్లో విశ్వాసం నింపింది. అందుకే....అఖండ మెజార్టీతో..ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి పీఠం ఆంధ్ర‌ప్ర‌జ క‌ట్ట‌బెట్టింది. రాజ‌న్న త‌న‌యుడు ముఖ్య‌మంత్రిగా ఉండే అవ‌కాశం క‌ల్పించింది.


వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌త్యేక‌త‌లు ఇవి 
– మొత్తం రోజులు 429
– పాదయాత్ర రోజులు 341
– 13 జిల్లాలు 
– నియోజకవర్గాలు 134
– 231 మండలాలు
– 2516 గ్రామాలు
– 54 మున్సిపాలిటీలు
– 8 కార్పొరేషన్లలో పాదయాత్ర
– 124 సభలు, సమావేశాలు
– 55 ఆత్మీయ సమ్మేళనాలు 
– 3648 కి.మీ నడక



మరింత సమాచారం తెలుసుకోండి: