పవన్ కళ్యాణ్.. ఒకప్పుడు సినీ పవర్ స్టార్ ఇప్పుడు కూడా పవర్ స్టార్ ఏ లెండి. కానీ ఇప్పుడు పవర్ స్టార్ కంటే జనసేన అధినేత అనేదే పెద్దది. రాజకీయాలలోకి అడుగు పెట్టి మొదట చంద్రబాబుకు మద్దతు ఇచ్చి ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టి.. పోటీ చేసిన రొండు చోట్ల అతి ఘోరంగా ఓడిపోయి.. 

           

175 స్థానాల్లో జనసేన సంపూర్ణంగా పోటీ చేస్తే పార్టీ మొత్తానికి ఒకేఒక ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్యేనే చాలు అంటున్నాడు పవన్ బాబు. ఇంకా విషయానికి వస్తే.. గాజువాక నాయకులు, జనసైనికులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులు వ్యాపారాలు చెయ్యకుండా ఎవరు ఉన్నారని ? 

          

వారి వ్యాపారలాలనే తాను సినిమాలు చేసుకుంటున్నట్టు చెప్పాడు. రాజకీయాలలో ఉండాలంటే డబ్బులు ఉండాలి.. డబ్బు కావాలంటే వ్యాపారాలు చెయ్యాలి. అలానే నేను సినిమాలు చేసుకుంటున్న అందులో తప్పేంటి అని ప్రశ్నించాడు. 100 కోట్లు కావాలంటే నేను సినిమాలు చేసి సంపాదిస్తా అడ్డా దారులు తొక్కను.. నాకు ఆ కర్మ పట్టలేదు అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

        

 కాగా వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ 151 ఎమ్మెల్యేలు ఉంటె ఏంటి ? 175 మంది ఉంటె ఏంటి ? జనసేనకు ఒక్క ఎమ్మెల్యే చాలన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నిజంగా ప్రజల సపోర్ట్ ఉంటె ఆ సీట్లు అన్ని మీకు వచ్చేవి కదా.. అయన మీకు ఒక్క ఎమ్మెల్యే చాలు అనే ఆ ఒక్క ఎమ్మెల్యేని గెలిపించారు అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: