గత కొన్ని రోజులుగా కాలుష్యం కొరల్లో చిక్కుకొని తీవ్రమైన ఇబ్బందులని ఎదుర్కొంటున్న మన దేశరాజధాని ఢిల్లీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సాధారణంగానే ఢిల్లీ లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ మద్యే దీపావళి పండుగ కూడా రావడంతో కాలుష్యం ఒక్కసారిగా భరించలేని స్దాయిలోకి వెళ్లింది. దీంతో ఢిల్లీ లో ఇక మేము ఉండలేము బాబోయ్ అంటూ కొంతమంది ఢిల్లీ నుండి దుకాణం సర్దేస్తున్నారట.


ఇక ఇలాంటి సందర్భంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేమంటే దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయాలన్న చర్చ పార్లమెంట్  ఎన్నికల సమయంలో వచ్చిందని, కానీ ఇప్పటి వరకు కేంద్రంలో కానీ, పార్టీలో కానీ ఈ విషయం పై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఇక హైదరాబాద్‌ను రెండో రాజధానిగా అంబేడ్కర్ ఎప్పుడో సూచించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదీగాకుండా గతంలో కూడా ఇలాంటి  వార్తలు ఎన్నో వచ్చినప్పటికీ ఇప్పుడు  మాజీ గవర్నర్ బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేయడంతో అయన మాటలకి ప్రాధాన్యత క్రమక్రమంగా సంతరించుకుంది.


ఇకపోతే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైపోయిందని, గాలి కాలుష్యం 400 పీపీఎంకు పైగా చేరుకోవడంతో అక్కడి ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఆరుబయటకు రావాలంటే వణికి పోతున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో హైదరాబాద్ రెండో రాజధానిగా సూటబుల్ అవుతుందని తెలిపారు.. ఇక రెండో రాజధాని అంశం ఒక బీజేపీకి సంబంధించినది మాత్రమే కాదని పేర్కొన్నారు.


ముందు ముందు హైదరాబాద్‌ను రాజధానిగా చూడాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కలసి కేంద్రం దగ్గరకు వెళ్ళాలని విద్యాసాగర్‌రావు చెప్పారు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కానీ రెండో రాజధాని కోసం అన్ని పార్టీలను లీడ్ చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: