జనసేనాని పవన్ కళ్యాణ్ విచిత్రమైన కామెంట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన ఆరునెలల తరువాత విశాఖ వచ్చి లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా పార్టీ సమీక్షల పేరిట సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ వచ్చిన నాయకులతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. సరికొత్త వాదనలు, వింత వాదనలు పవన్ చేస్తూనే ఉన్నారు.


నన్నే అంతా ఎందుకు ప్రశ్నిస్తున్నారు, నేను సినిమాలు చేసుకుంటానో లేదో అన్న విషయం నన్నే ఎందుకు అడుగుతున్నారు. ఏం ఎవరికి వ్యాపారాలు లేవు, రాజకీయాల్లొ అందరూ  అన్నీ వదులుకునే వచ్చారా అంటూ పవన్ అంటున్నారు. అదే సమయంలో మరో మారు జగన్ ప్రస్తావన కూడా తెస్తున్నారు. జగన్ రెడ్డికి జగతి పబ్లిక్సేషన్స్, భారతి సిమెంట్స్ ఇతర వ్యాపారలు ఉన్నాయి మరి నాకు కంపెనీలు ఏవీ లేవే, అవకతవకలు చేసి కంపెనీలు పెట్టే ఖర్మ నాకు లేదు అని కూడా పవన్ అంటున్నారు.


కోర్టుల  చుట్టూ తిరుగుతున్న ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా  నన్ను అడుగుతారేంటి  అంటూ పవన్ గుస్సా అవుతున్నారు. తాను ఒక్క ఎమ్మెల్యే కలిగిన పార్టీ అధినేతనని, 151 సీట్లు వచ్చిన వైసీపీ తనను టార్గెట్ చేస్తోందని పవన్ వాపోతున్నారు. నన్ను అన్నేసి మాటలు అంటున్నారంటే నిజంగా నేను బలమైన పార్టీ నేతనే అని చెప్పాలి అంటూ సర్దుకుంటున్నారు. ఇక యువత తన సభలకు వస్తున్నారని, ఓట్లు మాత్రం వేయడంలేదని కూడా పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా వేసినట్లు అయితే తనకు ఏపీలో డెబ్బై సీట్లు వచ్చి ఉండేవని కూడా ఆయన అంటున్నారు.


మొత్తానికి పవన్ ఇలా లాజిక్ కి అందని కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు పవన్ పార్టీని జనసేన నాయకులు కూడా నమ్మడంలేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అంటున్నారు. అ పవన్ సమీక్ష పెడితే కనీసం పది మంది నాయకులు కూడా రాలేదని ఆయన విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: