ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆయన్ను బాపట్లలోని హెచ్‌ఆర్‌డీ ఇన్ స్టిట్యూట్‌ డీజీగా నియమించారు. ఇకపోతే ఈ బదిలీ వెనకాల చాలా కారణాలున్నాయని ప్రచారం జరుగుతుండగా, బిజినెస్ రూల్స్ సవరించడంపై ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు ఎల్వీ సుబ్రమణ్యం ఇటీవలే షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  బిజినెస్ రూల్స్‌తో పాటు కండక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించారని ఎల్వీ సుబ్రమణ్యం అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, తన సొంత ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ కుమార్ విషయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వైఖరిపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.


మరోవైపు వైఎస్‌ఆర్ లైఫ్‌ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు ఫైల్‌ను ఆర్ధిక శాఖకు పంపమని ఎల్వీ సుబ్రమణ్యం కోరినా  ప్రవీణ్‌ ప్రకాష్ నేరుగా కేబినెట్‌కు రిఫర్ చేశారు. ఇదే కాకుండా చంద్రబాబును సీఎస్ హోదాలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎన్నికల సమయంలో ఓవర్ టేక్ చేసి  ప్రభుత్వాన్ని నడిపించడం అప్పట్లో జగన్‌కు నచ్చిందేమో కానీ ఇప్పుడు తాను సీఎంగా ఉండగా సీఎస్ తన మాట వినకపోవడం మాత్రం నచ్చలేదని తన సన్నిహితుల దగ్గర జగన్‌ చెప్పినట్లు తెలుస్తోంది.


ఇలాంటి చిన్నచితకా ఘటనలు ఒకట్రెండు జరిగినా జగన్ ఏమాత్రం బయటపడకపోవడంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం, తాను సీఎస్ హోదాలో జగన్‌కు సలహా ఇస్తున్నాననే అనుకున్నారు కానీ తన పద్ధతి జగన్‌కు నచ్చడం లేదని ఏ కోశాన అనుకోలేదట. ఈ వ్యవహారమే ఇద్దరి మద్య విభేదాలు ముదరడానికి కారణమైనట్టు తెలుస్తోంది. ఇదీ కాకుండా గత వారంలో  స్పందన కార్యక్రమంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా ఎల్వీ చెత్త డంపింగ్ యార్డుల కోసం భూములను ఎంపిక చేయడమే మొదటి ప్రాధాన్యతగా చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారట.


ఎందుకంటే ఇళ్ళ స్థలాలు కేటాయించిన తర్వాత చెత్త డంపింగ్ యార్డులకు స్థలం దొరకదన్నది ఎల్వీ సుబ్రమణ్యం అభిప్రాయం. ఇదే అంశాన్ని ఎల్వీ బహాటంగా చెప్పేసారు. ఇక సీఎం సమక్షంలో జరిగిన సమావేశం కాబట్లి సుబ్రమణ్యం తీసుకున్న నిర్ణయం జగన్ ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. ఇకపోతే వెంటనే 'ఇళ్ళ స్థలాలను గుర్తించడమే మొదటి ప్రాధాన్యత అని ఎల్వీకి జగన్ గట్టిగానే చెప్పారట.. ఇక ఇలాంటి మాటవినని వ్యవహారమే ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి కారణం అని చర్చించుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: