టీడీపీ  జనసేన దోస్తీ ఏంటో ఇప్పుడు బహిరంగంగా ప్రజలకు తెలిసిపోయింది. 2019 ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం అవినీతిమైపోయిందని విమర్శలు చేసిన మేధావి పవన్ గారు ఇప్పుడు రాజకీయ విలువలు లేకుండా మళ్ళీ చంద్రబాబుతో కలిసిపోయారు. అయితే లాంగ్ మార్చ్ కు టీడీపీ మద్దతు ఇచ్చినట్లు .. ఇప్పుడు చంద్రబాబు చేయబోయే దీక్షకు పవన్ మద్దతు ఇవ్వబోతున్నాడు. దీనితో ఇద్దరి స్నేహం మరింత బలపడనుంది. ఇసుక విషయంలో ఇటు జనసేన అటు టీడీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తునట్టు బిల్డప్ ఇస్తుంది. రాష్ట్రంలో వరదల వల్ల ఇసుక కొరత వచ్చిందని అందరికీ తెలుసు. కానీ ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయి. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతో విశాఖలో లాంగ్ మార్చ్ చేశారు. ఇక మన లోకేష్ బాబు కూడా గుంటూరులో నిరసన దీక్ష చేశారు. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.


ఈ నేపథ్యంలో ఈ నెల 14 వ తేదీన 12 గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి బాబు సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు.  గుంటూరు లోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు డిసైడ్ అయ్యారు. పవన్ చేసిన లాంగ్ మార్చ్ తో ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చిందని.. దాన్ని మరింత పెంచడానికి తాను దీక్షకు రెడీ అవుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఈనెల 14వ తేదీన 12 గంటల పాటు చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా దీక్షలో పాల్గొనాలని బాబు పిలుపునిచ్చారు.


 కొత్త ప్రభుత్వానికి కనీసం సమయం కూడా ఇవ్వకుండా పవన్ .. బాబు చేస్తున్న జిమ్ముక్కుల పట్ల వైసీపీ గట్టిగానే బదులు చెబుతుంది. ప్రజలు ఎన్నికల్లో కర్రుకాచి వాత పెట్టి నెలలు నిండకముందే ఇలా ఉద్యమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబు పవన్ వైఖరిని తేల్చుకుంటామని చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి కనీసం ఆరు నెలలు కూడా కాకముందే పవన్ .. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ప్రజల్లో చిరాకు పుట్టిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: