పవన్ కళ్యాణ్ తన సభలో ఆవేశంతో ఊగిపోయి వైసీపీ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మాములు అయిపొయింది. జనాల సమస్యల గురించి మాట్లాడకుండా వ్యక్తిగతంగా తిట్టడానికే పవన్ సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే మొన్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ .. కన్నబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. దీనితో కన్నబాబు పదునైన ప్రశ్నలతో పవన్ కు సవాలు విసిరారు. మంగళవారం తన సొంతూరు కాకినాడలో మీడియా ముందుకు వచ్చిన కన్నబాబు... పీకేను నిజంగానే కడిగిపారేశారనే చెప్పాలి. ఓ రేంజిలో కన్నబాబు వదిలిన బాణాల్లాంటి మాటలకు అసలు పీకే నుంచి రిప్లై వచ్చే అవకాశాలే లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


ఇంతకు కన్నబాబు పవన్ మీద చేసిన విమర్శలను గమనిస్తే ..  ‘భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసిన టీడీపీతో కలిసి లాంగ్ మార్చ్ చేసిన పవన్ కు ఇసుక కొరతపై మాట్లాడే హక్కే లేదు. ఒక్క సీటుకే ఇంత హడావిడి చేస్తున్న పవన్ ... ఇంకా కొన్ని సీట్లు వస్తే పరిస్థితి ఎలా ఉండేదో? రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సినిమాలు వదిలేసి వచ్చానని చెబుతున్న పవన్... యాక్టింగ్ మాత్రం మానుకోలేదు. విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా... జగన్ ను విమర్శించడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఇంకా కన్నబాబు మాట్లాడుతూ నన్ను తిట్టడం పవన్ కు ఫ్యాషన్ అయిపోయిందని .. చిరంజీవి గారి వల్లనే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటికీ చెప్పుకుంటుంటా. రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఎప్పుడైనా చిరంజీవి పేరు చెప్పారా? గాజువాకలో పవన్ పోటీ చేస్తే చంద్రబాబు ప్రచారం చేయలేదు. మంగళగిరిలో లోకేశ్ పోటీ చేస్తే జనసేన అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు. 15 రోజుల్లో ఇసుక సమస్యను తీర్చకపోతే.. అమరావతి వీధుల్లో నడుస్తానంటూ పవన్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. అమరావతిలో అసలు వీధులే లేవు. చంద్రబాబు చూపింది గ్రాఫిక్స్ మాత్రమే. చంద్రబాబు తప్ప పవన్ కు మరో నేత కనిపించడం లేదు’ అంటూ కన్నబాబు తనదైన శైలిలో పవన్ ను దుమ్ముదులిపేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: