గత 33 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్.  ఈ డిమాండ్ తో పాటుగా మరో 26 డిమాండ్లను ఆర్టీసీ ప్రభుత్వం ముందు ఉంచింది.  వాటిని పరిశీలించి నెరవేర్చే విధంగా చూడాలని ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టారు.  కానీ, ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో కార్మికులు రోడ్డెక్కారు.  33 రోజులుగా సమ్మె చేస్తున్నారు.  33 రోజులుగా రాష్ట్రంలో బస్సులు తిరగడం లేదు.  


అరకొర బస్సులు తప్పించి గతంలో మాదిరిగా రోడ్డుపై బస్సులు కనిపించడం లేదు.  పైగా ఆర్టీసీ బస్సుల కండిషన్స్ గురించి ఆర్టీసీ కార్మికులకు మాత్రమే తెలుసు.  వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా వారికి తెలుసు.  కానీ, కార్మికులు సమ్మె చేస్తుండటంతో.. ప్రభుత్వం కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను తీసుకొని బస్సులను నడుపుతున్నది.  కానీ, బస్సుల కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోకుండానే రోడ్డుపైకి తీసుకొస్తున్నారు.  ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు.  


రోడ్డుపైకి వస్తున్న వాహనాల్లో ఒక్కటి కూడా సరైన కండిషన్స్ లో ఉన్నట్టుగా కనిపించం లేదు.  ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి.  దీంతో బస్సుల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల అవస్థలు నానాటికి దారుణంగా మారిపోతున్నాయి.  మెట్రో, ఇతర వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తోంది.  ఇదిలా ఉంటె, అసలు ఆర్టీసీని ఎత్తేస్తామని ప్రభుత్వం చెప్తోంది.  ఈ విషయం గురించి హుజుర్ నగర్ విజయం తరువాత కెసిఆర్ స్పష్టంగా చెప్పారు.  


ఆర్టీసీనే ఉండటం లేదు.. ఇక ప్రభుత్వంలో ఎలా విలీనం చేస్తామని చెప్పాడు.  ఆర్తిని ఎత్తేసి వేరే సంస్థగా మార్చడం అంటే మాములు విషయం కాదు.  ఇప్పటి వరకు ఆర్టీసీ విభజన పూర్తిగా జరగలేదు.  అంతేకాదు, ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వం వాటా 30శాతం ఉన్నది.  ఆర్టీసీని మార్చాలి అంటే తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలి.  కేంద్రం అనుమతి లేకుండా ఆర్టీసీని మార్చడం కుదరదు.  కేంద్రంతో తెరాస ప్రభుత్వం ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నదో అందరికి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: