ప్రవీణ్ ప్రకాశ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న ఐఏఎస్ పేరు. ఆయన సీఎంఓ అధికారి అయి ఉండి.. ఏకంగా సీఎస్ ను బదిలీ చేయడంతో ఈ పేరు బాగా పాపులర్ అయ్యింది. ఆయన చేసింది రాంగా రైటా అనే విషయం పక్కన పెడితే ఆయన బ్యాక్ గ్రౌండ్ చాలా ఆసక్తి రేపుతుంది.


ఆయన చాలా కాలం క్రితం తెలుగు దేశం1999-2004 మధ్య కాలంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా.. తర్వాత గుంటూరు మున్సిపల్ కమిషనర్.. ఆ తరవాత వైజాగ్ కలెక్టర్ గా.. అంతకుముందు ఐటీడీఏ అధికారిగా పని చేశారు. వెరీ సిన్సియర్ ఆఫీసర్ గా పేరుంది. పది పైసల అవినీతి చేసే రకం కాదు. ఆయన ఒక ఫైల్ తయారు చేస్తే దాంట్లో వంక పెట్టడానికి అవతలి వాళ్ల కు అవకాశం ఉండదు. ఆయన హానెస్టీ వల్ల దిల్లీ సర్కిల్స్ లో ఆయనంటే మంచి రెస్పెక్ట్ ఉంది.


విజయవాడ రోడ్ల వెడల్పు ఆయన చలవే. ఆయన సమయంలో ఆయన చాలా ఒత్తిళ్లు ఎదుర్కొన్నా.. ధైర్యంగా పని చేశారు. ఆ తర్వాత గుంటూరు రోడ్ల వెడల్పు విషయంలోనూ అంతే. బెజవాడ బందర్ రోడ్డు ఏలూరు రోడ్ గాంధీ నగర్ లో ఇవాళ్టికీ బళ్లు నడవగలుగుతున్నాయంటే.. బస్సుల తిరగగలుగుతున్నాయంటే.. అందుకు ఆనాడు ఆయన చూపిన చొరవే కారణం.


ఐటిడిఏ అధికారిగానూ ఆయన సంచలనాలు సృష్టించారు. భద్రాచలం ఏజన్సీలోని కొండ ప్రాంతాల్లో గిరిజనుల వద్దకే పాఠశాలలను తీసుకెళ్లారు. గిరిజనుల కోసం ఆ రోజుల్లోనే కొండల పైన స్కూల్ ఏర్పాటు చేయించారు. గిరిజన పిల్లల కిందకురారని పైకి టీచర్లు పాఠాలు చెప్పే ఏర్పాటు చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాల పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భం లో ఆయన సమర్థంగా పనిచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: