మనదేశంలో ఆవు మూత్రానికి, ఆవు పాలకు మంచి గిరాకీ ఉన్నది.  ఆవు మూత్రం సర్వరోగ నివారణం అని అంటారు.  ఆవు మూత్రంలో అనేక ఔషదాలు ఉంటాయి.  ఈ ఔషదాలు మనిషి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపయోగపడతాయి.  క్యాన్సర్ వంటి రోగాలు సైతం ఈ మూత్రంతో నయం అవుతాయి.  అందుకే ఉదయాన్నే పరగడుపున చాలామంది గోమూత్రాన్ని సేవిస్తారు.  గో మూత్రాన్ని అనేక ఆయుర్వేద, హోమియో మెడిసిన్స్ లో వినియోగిస్తారు అనే విషయం తెలిసిందే.  


అయితే, ఇప్పుడు గో మూత్రంతో పాటు ఒంటె మూత్రానికి కూడా గిరాకీ పెరిగింది.  ఒంటె మూత్రంలో నీటిని నిల్వచేసే సామర్ధ్యం ఉంటుంది.  ఒంటె మూత్రంలో అలసట రాకుండా చూస్తుంది.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  అయితే, డైరెక్ట్ గా ఒంటె మూత్రం ఒక్కటే కాకుండా ఒంటె మూత్రంతో పాటుగా ఒంటె పాలను కలిపి తీసుకుంటూ ఉంటారు. ఈ రెండు కలిపి తీసుకోవడం వలన శరీరం ఎండ నుంచి రక్షించబడింది.  


మదీనాకు వచ్చే విదేశీయులకు అక్కడి వాతావరణం సరిగా సరిపడదు.  దీంతో వారు  ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటారు.  ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే తప్పకుండా వారికి ఒంటె మూత్రం తీసుకోవడం అవసరం అని అక్కడి ప్రజలు అంటున్నారు.  దీంతో మదీనాలో ఒంటె మూత్రం అమ్మకాలకు రెక్కలు వచ్చాయి.  మూత్రాన్ని అమ్మే షాపులు అక్కడ ఎక్కువయ్యాయి.  ఒంటె మూత్రంతో పాటుగా పాలను కూడా అమ్ముతున్నారు.  


మదీనా టూరిస్ట్ ప్లేస్ గా మారడంతో ఒంటె యజమానులకు వరంగా మారింది.  భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి.  ఒంటె మూత్రం తీసుకోవడం గురించి పవిత్రమైన ఖురాన్ గ్రంధంలో కూడా రాసుండటంతో ఒంటె మూత్రాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.  ఇక ఇదిలా ఉంటె, మూత్రానికి గిరాకీ ఏర్పడటంతో కొంతమంది మూత్రాన్ని కల్తీ చేసి అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది.  మదీనాలోని కొన్ని షాపుల్లో అమ్ముతున్న కల్తీ మూత్రాన్ని పోలీసులు ఇటీవలే స్వాధీనం చేసుకున్నారు. చివరకు వ్యాపారం కోసం మూత్రాన్ని కూడా కల్తీగా మార్చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: