ఎల్లోమీడియాలో  ఇటువంటి పనికిమాలిన వార్తలు వస్తున్నాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో పట్టుకొచ్చిందా ? ఇపుడిదే చర్చ మొదలైంది.  రెండు అంశాలపై ఎల్లోమీడియాలో వచ్చిన కథనాలే అందరినీ ఆశ్చర్య పరిచాయి. మొదటిది గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ రాజీనామాపై వచ్చిన కథనం విచిత్రంగా ఉంది. రెండోది తాజా మాజీ సిఎం ఎల్వీ సుబ్రమణ్యంపై అచ్చేసిన కథనం.

 

మొదటి వంశీ రాజీనామా కథనాన్నే తీసుకుందాం. చంద్రబాబునాయుడే టార్గెట్ గా జగన్ పావులు కదుపుతున్నట్లు రాశారు. 151 సీట్లతో అఖండ మెజారిటి ఉన్నా చంద్రబాబుకు అసెంబ్లీలో ప్రతిపక్షహోదా దక్కనీయకుండా  కుట్ర చేస్తున్నారట జగన్.  7 మంది ఎంఎల్ఏలను లాగేస్తే టిడిపి బలం 16కి పడిపోతుంది కాబట్టి చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్షహోదా పోతుందని ఎల్లోమీడియా తెగ బాధపడిపోయింది.

 

జగన్ ను ఉద్దేశించి ఎల్లోమీడియా రాసింది నిజమే అనుకుందాం. మరి ఐదేళ్ళ క్రితం జగన్ విషయంలో  చంద్రబాబు చేసిందేమిటి ? అప్పుడు కూడా చంద్రబాబుకు అవసరం లేకపోయినా వైసిపి నుండి 23 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను ఎందుకు లాక్కున్నారు ? ఇపుడు జగన్ చేస్తున్నదాన్ని తప్పు పడుతున్న ఎల్లోమీడియాకు అప్పట్లో చంద్రబాబు చేసింది తప్పుగా కనబడలేదా ? టిడిపి ఎంఎల్ఏలు రాజీనామా చేస్తేనే వైసిపిలో చేర్చుకుంటున్నట్లు జగన్ కండీషన్ పెట్టారు. కానీ చంద్రబాబు ఆ పని కూడా చేయలేదు కదా ?

 

ఇక తాజాగా ఎల్వీ సుబ్రమణ్యం విషయాన్ని చూద్దాం. ఎల్వీని బాగా వాడుకుని అర్ధాంతరంగా ప్రధాన కార్యదర్శిగా తొలగించి జగన్ అవమానించారని బోల్డు బాధపడిపోతోంది. ఏ అధికారిని  ఎక్కడ ఉపయోగించుకోవాలన్నది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమే. కాబట్టే అప్పట్లో చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు ఆనందరావు, స్వామినాధన్ లను కూడా ప్రధాన కార్యదర్శులుగా అర్ధాంతరంగా బదిలీచేశారు.

 

అప్పట్లో వారిద్దరిని అవమానించిన చంద్రబాబు కూడా ఇపుడు జగన్ ను తప్పు పడుతుండటమే విచిత్రంగా ఉంది. ఇపుడు జగన్ ను తప్పుపడుతున్న ఎల్లోమీడియా చంద్రబాబు విషయాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు ? చంద్రబాబుకు మద్దతుగా  జగన్ పై ఉద్దేశ్యపూర్వకంగా బురద చల్లుతోంది కాబట్టే వైసిపి ప్రభుత్వం ఎల్లోమీడియాకు స్పీడు బ్రేకర్లు వేస్తోందంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: