తెలుగుదేశం పార్టీ పుట్టుక దాదాపు నాలుగు దశాబ్దల క్రితం జరిగింది. ఎన్నో ఎన్నికలను, మరెన్నో యుధ్ధాలను ఆ పార్టీ చవి చూసింది. ఇప్పటికి అయిదు  సార్లు గెలిచింది. . అన్న గారు మూడు సార్లు, చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రులుగా  బాధ్యతలు నిర్వహించారు. ఏపీలో టీడీపీకి ధీటైన ప్రాంతీయ పార్టీ  ఉంటుందా అన్న డౌట్లు వచ్చేలా ఆ పార్టీ వైభవం ఉంటూ వచ్చింది.


ఇదిలా ఉండగా పదేళ్ళ క్రితం ఏర్పడిన వైసీపీ ఇపుడు టీడీపీ ప్లేస్ ని అన్ని విధాలుగా ఆక్రమించేసింది. ఒకనాడు టీడీపీ చరిత్ర స్రుష్టిస్తే ఇపుడు ఆ ప్లేస్ లో వైసీపీ వచ్చి కూర్చుంది. చరిత్రను తిరిగరాసింది కూడా. ఏపీలో 151 సీట్లు 22 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవడం అంటే మాటలు కాదు, ఇదిలా ఉండగా జగన్ తిరుగులేని ముఖ్యమంత్రిగా గత ఆరు నెలలుగా పాలన సాగిస్తున్నారు.


మరో వైపు ఆర్ధికంగానూ వైసీపీ బలంగా ఉన్నట్లుగా తాజా గణాంకాలు తెలియచేస్తున్నాయి. దేశీయ ఫండ్స్ వ్రుధ్ధి రేటు కలిగిన పార్టీల్లో వైసీపె మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘానికి  ఆయా పార్టీలు సమర్పించిన వార్షిక నివేదికను అనుసరించి ఏడీయార్ సంస్థ వీటిని వెల్లడించింది. దీని ప్రకారం చూసుకుంటే పార్టీ ఫండ్స్ లో వైసీపీ 2016 2017లతో పోలిస్తే  2018 సంవత్సరంలో
 225.1 శాతం  ఫండ్స్ వ్రుద్ధి రేటు పెంచుకుని టాప్ గా నిలిచింది. ఇక టీడీపీ విషయానికి వస్తే  15.4 శాతం ఉండగా, టీయారెస్ 100.4 శాతం మాత్రమే ఉన్నాయి.  ఇక దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల్లోకి అతి సంపన్న పార్టీగా సమాజ్ వాదీ పార్టీ నిలుస్తుందని అంటున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రలా వరకూ చూసుకుంటే వైసీపీ నంబర్ వన్ గానే ఉందని చెప్పాలిక్కడ.
 


మరింత సమాచారం తెలుసుకోండి: