సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తాయిలాలు  ఇస్తోంది.  సమ్మెను పక్కన పెట్టి విధుల్లో జాయిన్ కావాలని కోరుతోంది.  మంగళవారం అర్ధరాత్రి వరకు గడువు ఇచ్చింది.  ఈ గడువులోపల కార్మికులు సమ్మెను పక్కన పెట్టి విధుల్లో చేరాలని, విధుల్లో చేరుతున్నట్టుగా జాయినింగ్ లేఖను ఇవ్వాలని ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ పేర్కొన్నారు.  అయితే కార్మికులు ఎక్కడి నుంచైనా సరే ఈ లేఖలు ఇవ్వొచ్చని నిన్నటి రోజున సునీల్ శర్మ పేర్కొన్నారు.  ఒక్క డిపో కార్యాలయాల్లోనే కాకుండా, ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాలు, డిఎస్పీ కార్యాలయాలు, తాము పనిచేస్తున్న డిపో మేనేజర్ కార్యాలయాలు, లేదా డీవీఎం కార్యాలయాల్లో కానీ లేదా రీజనల్ మేనేజర్ కార్యాలయాల్లో  కూడా లేఖలు ఇవ్వొచ్చని ఆయన తెలిపారు.  


అలా మంగళవారం అర్ధరాత్రి వరకు వచ్చిన లేఖలను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.  అయితే, అర్ధరాత్రి వరకు ఎన్ని లేఖలు వచ్చాయి.. ఎంతమంది విధుల్లోకి చేరబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది.  ఆర్టీసీ జేఏసీ మాత్రం.. కార్మికులు విధుల్లో చేరడం లేదని, 48వేలమంది కార్మికులున్న ఆర్టీసీలో కేవలం 300 మంది మాత్రమే జాయిన్ అయ్యేందుకు వెళ్లారని, వాళ్లలో కొంతమంది తిరిగి వస్తున్నారని జేఏసీ చెప్తున్నది.  


ప్రభుత్వం, ఆర్టీసీ ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు.  తప్పకుండా కార్మికులు ఈ విషయంలో విజయం సాధిస్తారని అంటున్నారు.  ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి చర్చలు జరపాలని, చర్చలు జరపని నేపథ్యంలో సమ్మె యధాతధంగా కొనసాగుతుందని అంటున్నారు.  33 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామని, సమ్మె విరమించే ప్రసక్తి లేదని కార్మికులుచెప్తున్నారు.  


ఇదిలా ఉంటె, ఈనెల 7 వ తేదీన హైకోర్టు ఈ సమ్మె విషయంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నది.  ఈ నిర్ణయాన్ని అనుసరించి అటు ప్రభుత్వంకాని, ఇటు ఆర్టీసీ కార్మికులు కానీ తదుపరి కార్యాచరణ ఏంటి అన్నది తెలుస్తుంది.  డెడ్ లైన్ విధిస్తే కార్మికులు విధుల్లోకి వస్తారు.. దానికి సంబంధించిన నివేదికను కోర్టుకు చూపించి.. సమ్మె విరమించేలా చెయ్యొచ్చు అన్నది కెసిఆర్ ఎత్తుగడ.  కానీ, కార్మికులు మాత్రం ససేమిరా అనడంతో ఏం జరుగుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: