ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ను ఖాతరు చేయలేదు . నవంబర్ ఐదవ తేదీ అర్ధరాత్రిలోగా సమ్మె విరమించి భేషరతుగా విధుల్లో చేరి , తమ ఉద్యోగాలను కాపాడుకోవాలంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు కు కేవలం 300 మంది పైగా కార్మికులు మాత్రమే స్పందించినట్లు తెలుస్తోంది . ఇందులో హెడ్ క్వార్ట్రర్ అంటే బస్ భవన్ లో విధులు నిర్వహించే వారి సంఖ్యనే అధికంగా ఉన్నట్లు సమాచారం . ఆర్టీసీ డ్రైవర్ , కండక్టర్లు ముఖ్యమంత్రి డెడ్ లైన్ ను పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా , యధావిధిగా సమ్మె కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్న నేపధ్యం లో , ఆర్టీసీ భవితవ్యం  పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది .


 ఇప్పటికే 5100 రూట్లను ప్రయివేటీకరించాలని మంత్రివర్గ సమావేశం లో నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , మంగళవారం అర్ధరాత్రిలోగా కార్మికులు భేషరతుగా సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే మరో 5100 రూట్లను కూడా ప్రయివేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ వెల్లడించిన విషయం తెల్సిందే . ప్రభుత్వం విధించిన గడువు తీరిపోవడం , కార్మికులు సమ్మె విరమణకు సిద్ధంగా లేకపోవడం తో ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులోనే ఉంది . ఆర్టీసీ ప్రయివేటీకరణ దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తారా ?, లేకపోతే సమ్మె చేస్తున్న కార్మికులను చర్చలకు పిలుస్తారా ? అన్నది ఉత్కంఠభరితంగా మారింది . 


రాష్ట్ర ప్రభుత్వానికి  ఆర్టీసీని ప్రయివేటీకరించే అధికారం లేదని , ఎందుకంటే ఆర్టీసీ లో 31 నిధులు కేంద్రానివి కూడా ఉన్న నేపధ్యం లో కేంద్రం అనుమతి తప్పనిసరి అంటూ కార్మిక సంఘాల జెఎసి నేతలు చెబుతున్నారు . అయితే ఇప్పటికే చాల రాష్ట్రాల్లో ఆర్టీసీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయని కేసీఆర్ చెబుతుండడం పరిశీలిస్తే ... ఎవరి మాట న్యాయస్థానం ముందు చెల్లుబాటు అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది . 


మరింత సమాచారం తెలుసుకోండి: