తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం ఘటనలో నిజాలు క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్నాయి.  పక్కా ప్రణాళికతోనే నిందితుడు కూర సురేష్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డిపై ఘాతుకానికి పాల్పడినట్లు హత్యకు ముందు, తర్వాత పరిణామాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. విజయా రెడ్డి ని హత్య చేసిన తరవాత నిందితుడు సురేష్ తాపీ గా కార్యాలయం బయటకు వచ్చి దగ్గరలోని వైన్స్‌ ముందు కారులో ఉన్నవారితో మాట్లాడాడు తరువాత తిన్నగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. 


పోలీసులు కూడా విజయా రెడ్డి హత్య ను పక్కా ప్రణాళిక తో చేసినట్లు ప్రాథమిక విచారణలో కనుగొన్నారు. నిందితుడి గ్రామం గౌరెళ్ళి కి తహసీల్దార్ కార్యాలయం కేవలం 8 కిమీ దూరం మాత్రమే. భూ సమస్యలున్న రైతులతో కలిసి అతడు అప్పుడప్పుడు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లినట్లుగా గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ  క్రమంలోనే కార్యాలయంలో ఏ అధికారి ఎక్కడ కూర్చుంటారు, మార్గాలు తదితర అంశాలపై నిందితుడు సురేష్ పూర్తి అవగాహన ఏర్పరుచుకున్నాడు.

ఎమ్మార్వో ఆఫీస్ లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సురేష్‌ ముందే తెలుసుకున్నాడు. ఘటన జరిగిన రోజు (నవంబర్ 4 వ తేదీ) గ్రీవెన్స్‌ డే కావడంతో తమ సమస్యలు తెలియజేసేందుకు కార్యాలయానికి అధిక సంఖ్యలో జనం వస్తారని, ఆ హడావుడిలో పెట్రోల్‌ తీసుకెళ్లినా ఎవరూ గుర్తించరని భావించాడు. ఆఫీస్ వెనుకనుంచి పెట్రోల్ క్యాన్‌ ను ఎమ్మార్వో ఛాంబర్ వరకు తీసుకువెళ్లాడు.  


ఎమ్మార్వో భోజన సమయం లో ఛాంబర్లోకి ప్రవేశించిన నిందితుడు తహసీల్దార్ విజయా రెడ్డి తో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో తనతో తెచ్చుకున్న పెట్రోల్ ను ఎమ్మార్వో పై పోసి లైటర్ తో అంటించాడు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఎమ్మార్వో విజయా రెడ్డి అగ్నికి ఆహుతి అయ్యారు. ఘటన తరువాత నిందితుడు పిచ్చోడిలా నటిస్తూ కార్యాలయం బయటకు వచ్చి తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: