దేశంలో ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువ మోతాదులో వర్షాలు కురిసి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురిచేసాయి . వర్షాలు వరదలు గా మారి  ఎన్నో ప్రాంతాలను మంచిత్తడంతో  జనజీవనం స్తంభించిపోయింది. ఓవైపు విష జ్వరాలతో బాధపడుతున్నా జనాలందరూ... గత కొంతకాలంగా దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతోబెంబేలెత్తిపోతున్నారు . ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో అక్కడి ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో పరిసరాలన్నీ   మునిగిపోయి జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పుడు దేశంలో వర్షం పేరు చెపితేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీగా కురిసిన వర్షాలతో ఎక్కడికక్కడ పంటలు దెబ్బతినగా... ఇళ్లలోకి  నీరు చేరి జనజీవనం స్తంభించిపోయింది. దీంతో కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టాయి అనుకుంటున్న తరుణంలో... జలమయమైన గ్రామాలను ఇప్పుడిప్పుడే జల దిగ్బంధనం  నుంచి బయటపడుతున్న సమయంలో మళ్లీ దేశ ప్రజలందరి మరో తుఫాను దడపుట్టిస్తుంది . 

 

 

 బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో పారాదీప్ కు  దక్షిణంగా ఈ వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. బంగాళాఖాతంలో దక్షిణంగా 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం  అయినా  వాయుగుండం  తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని.. క్రమేపీ భారీ తుపాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో భారీ తుపానుగా మారి ఒరిస్సా బెంగాల్ రాష్ట్రాల మీదుగా మధ్య  తీరం దాటే అవకాశం ఉందని... ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరిస్తున్నారు. కాగా  ఈ తుఫాన్ కి బుల్ బుల్  తుఫానుగా నామకరణం చేశారు వాతావరణ శాఖ అధికారులు. 

 

 

 

 ఇప్పటికే భారీ వర్షాలతో బెంబేలెత్తిపోయారు ప్రజలు. ఇప్పుడు మరోసారి భారీ తుఫాను వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండటంతో ... ప్రజలు  భయపడిపోతున్నారు. ఇప్పటికే భారీగా కురిసిన వర్షాలతో గ్రామాల్లోకి నీరు చేరి జనజీవనం స్తంభించిపోయి... నానా అవస్థలు పడ్డారు. అని మరోసారి... భారీ తుఫాను ప్రభావం చూపితే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుల్ బుల్ తుఫానుగా మారి విజృంభించనుండగా   ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: