తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ ఉద్యోగులు హడలిపోతున్నారు. పటిష్టమైన సెక్యూరిటీ ఉన్నాకూడా హంతకుడు సురేష్ ముదిరాజ్ నేరుగా తహసీల్దార్ కార్యాలయంలోని వెళ్లి ఆమెతో వాగ్వాదం పెట్టుకోవడంతో పాటు ఆ తర్వాత.. బయటకు వచ్చి నేరుగా రెండు లీటర్ల పెట్రోల్ ఉన్న బాటిల్ ను లోపలకి తీసుకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే పెట్రోల్ చ‌ల్లి లైట‌ర్‌ ద్వారా నిప్పు అంటించాడు. త‌హ‌సీల్దార్ ఆఫీస్ లో తోటి ఉద్యోగులతో పాటు ఎంతో మంది ఉన్నా సురేష్ ఎంత ధైర్యంగా ఆమెను అందరిముందే హత్య చేశాడు.


ఈ సంఘటన తర్వాత రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడెక్కడ అలెర్ట్‌ అవుతున్నారు. ఎవరిని నేరుగా లోపలకు అనుమతించడం లేదు. లోపలికి వచ్చేవారిని అటెండర్ చెక్ చేసిన తర్వాతే లోపలకు పంపిస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యాల‌యాల్లో త‌హ‌సీల్దార్ల కోసం కొంద‌రు ప్ర‌త్యేకంగా చాంబ‌ర్లు ఏర్పాటు చేయించుకుంటున్నారు. తెలంగాణ‌లోనే కాదు ఏపీలోనూ ఈ తంతు జ‌రుగుతోంది.


క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ త‌హ‌సీల్దార్ ఉమా మ‌హేశ్వ‌రి త‌న చాంబ‌ర్‌లో అడ్డుగా తాడు క‌ట్టించారు. త‌న‌కు ఎవ‌రైనా అర్జీలు ఇచ్చేందుకు వ‌స్తే వారు ఆ తాడుకు అవ‌త‌ల నుంచే ఇవ్వాల‌న్న కండీష‌న్ పెట్టారు. ఇక లోప‌ల‌కు ఎవ్వ‌రిని అనుమ‌తించ‌వ‌ద్ద‌ని... ఇక అనుమానితుల‌ను అస‌లు లోప‌ల‌కే రానివ్వ‌వ‌ద్ద‌ని చెప్పేశారు. ఎక్క‌డో తెలంగాణ‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌తో ఇక్క‌డ ఈమె అలెర్ట్ అవ్వ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా.. కార్యాల‌యంలో ఆమె చేస్తోన్న హ‌డావిడి చూసిన ప్ర‌జ‌లు, కార్యాల‌య సిబ్బంది మాత్రం షాక్ అవుతున్నారు.


దీనిపై త‌హ‌సీల్దార్ ఉమామ‌హేశ్వ‌రి మాట్లాడుతూ మా జాగ్ర‌త్త‌లు మీం తీసుకోవాలి క‌దా ? అని చెపుతున్నారు. ఏదేమైనా విజ‌యారెడ్డి ఘ‌ట‌న త‌ర్వాత చాలా మంది రెవెన్యూ ఉద్యోగుల్లో ఎక్క‌డా లేని టెన్ష‌న్ నెల‌కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: