భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సభలోను.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి అధికార పార్టీని విమర్శలు చేశారు. ప్రతి ఒక్కరిని మర్యాదలేకుండా మాట్లాడారు పవన్ కళ్యాణ్. దీంతో మంత్రి కన్నబాబు కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేశారు. 


మీడియా సమావేశం మొదలు పెట్టగానే చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ లుసుగుల గురించి ఆసక్తికార వ్యాఖ్యలు చేశారు. అధికారపార్టీపై పడేకి ఏది లేక ఇసుక కొరతను ఆయుధంగా చేసుకొని ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి అని మంత్రి కన్నాబాబు విమర్శలు చేశారు. కాగా పవన్ కళ్యాణ్ విజయ సాయి రెడ్డిని విమర్శించే అంత గొప్పవాడా ? అతని చదువు ఏంటి ? ఇతని చదువు ఏంటి అని ప్రశ్నించారు. 


వరదల కారణంగా కొంతమేర ఇసుక కొరత ఉండటం వాస్తమేనని.. కానీ ఈ 10, 15 రోజుల్లో సమస్యను అధిగమిస్తామని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసిందే టీడీపీ. మళ్ళి అదే టీడీపీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ లాంగ్‌మార్చ్‌ నిర్వహించడం ఏంటి అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కి ఒక్క సీటు వస్తే ఎగిరెగిరి పడుతున్నాడు అని అన్నారు. 


కాగా పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసినా యాక్టింగ్ మాత్రం వదలడం లేదు అని కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న లేకున్నా వైఎస్ జగన్ ని విరమశిస్తున్నారు ఇదెక్కడి విడ్డురం అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పైకి వంటి కాలిమీద నిలబడి వస్తాడు.. జగన్ అని రాగానే జగన్ రెడ్డి అని వత్తి పలుకుతాడు. రెడ్డి అనేది గుర్తు చేస్తాడు.. అదే చంద్రబాబు నాయుడు విషయంలో ఆలా అసలు మాట్లాడాడు అని అన్నారు.  


కన్నబాబు మాట్లాడుతూ .. పవన్ కళ్యాణ్ కు నన్ను తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. నా బతుకులో దాపరికం లేదు. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు జనం బతుకులు చూసుకోవాలి. చిరంజీవి గారి వలనే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటికీ చెప్పుకుంటుంటా. రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఏనాడైనా చిరంజీవి పేరు చెప్పారా?  గాజువాకలో పవన్ పోటీ చేస్తే చంద్రబాబు ప్రచారం చేయలేదు. మంగళగిరిలో లోకేశ్‌ పోటీ చేస్తే జనసేన పార్టీ తరుఫున అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు?.. ఇప్పుడు ఇవి అన్ని మాట్లాడినందుకు మళ్ళి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి అయినా సరే నన్ను తిడుతాడు. కానీ ఇంతకంటే ఎం తిడుతాడు. ఇంకో అరగంట ఎక్కువ తిడుతాడు అని కన్నబాబు వ్యాఖ్యానించారు.  


కాగా ఇసుక సమస్యను 15 రోజుల్లో తీర్చకపోతే అమరావతి వీధుల్లో నడుస్తానంటూ పవన్ సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు తప్ప మరో నాయకుడు ఆయనకు కనిపించడం లేదు. అమరావతిలో అసలు వీధులే లేవు ఇంకా పవన్ ఎక్కడికి వెళ్లి నడుస్తాడు. చంద్రబాబు చూపింది అంత రాజమౌళి, బోయపాటి గ్రాఫిక్స్ మాత్రమే. అవి నిజమనుకుంటే ఎలా ? పవన్‌ ఇలాంటి నాటకాల రాజకీయ పోరాటాలు మానుకోవాలి. ఇసుక కొరత సమస్యను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది అని కన్నబాబు చెప్పారు. మరి కన్నబాబు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: