క్రైస్తవ సంఘాలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బు పట్టిస్తున్నాయి. తాజా మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపై హర్షం వ్యక్తం చేస్తు కేకులు కట్ చేసుకుంటున్నాయి. పైగా తమ హర్షాన్ని చెబుతు ప్రెస్ నోట్ ను జారీ చేయటంతో పాటు కేక్ కట్ చేసిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయటం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

 

ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని జగన్ ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.   బదిలీకి కారణాలు ఏవైనా మరో ఆరు మాసాల్లో రిటైర్ అవబోతున్న ఎల్వీకి మాత్రం అవమానం క్రిందే లెక్క. పైగా తన క్రిందస్ధాయి అధికారితో గొడవల నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగానికి బాస్ అయిన తనను జగన్ బదిలీ చేయటాన్ని ఎల్వీ జీర్ణించుకోలేకపోతున్నది వాస్తవం.

 

సరే ఎల్వీ బదిలీకి ప్రభుత్వం పరిపాలనాపరమైన సౌలభ్యాన్ని చూపుతోంది. నిజానికి ఏ అధికారిని ఎక్కడ ఉపయోగించుకోవాలన్న విషయం పూర్తిగా జగన్ విచక్షణ అన్న విషయం అందరికీ తెలిసిందే. అందరికీ కనిపిస్తున్న వాస్తవాలు ఇలా వుండగానే క్రైస్తవ సంఘాలు మధ్యలో దూరి విషయాన్ని కంపు చేస్తున్నాయి.

 

ఎల్వీ బదిలి క్రైస్తవ సంఘాల ప్రార్ధనల ఫలితమే అంటూ అఖిల భారత దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య, క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి ప్రెస్ నోట్ విడుదల చేయటం గమనార్హం. అంతే కాకుండా ఎల్వీ బదిలీతో సంబరాలు చేసుకుంటూ కేక్ కట్ చేసిన ఫొటోలను కూడా మీడియాకు రిలీజ్ చేయటంతో జగన్ కు సమస్యలు మొదలయ్యాయి.

 

హిందు దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగాలు చేయటంపై ప్రభుత్వం ఓ జీవో విడుదల చేసింది. జగన్ స్ధాయిలో తీసుకున్న నిర్ణయం తర్వాతే ఎల్వీ జీవో జారీ చేశారు. ఎల్వీ జారీ చేసిన ప్రతి జీవో కూడా జగన్ నిర్ణయం తర్వాతే  విడుదలైనందన్న విషయాన్ని క్రైస్తవ సంఘాలు మరచిపోతున్నాయి. తమ అత్యుత్సాహంతో ఎల్వీ బదిలీపై పండగ చేసుకుంటూ జగన్ ను గబ్బు పట్టిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: