రాజకీయం అంటేనే  పెద్ద ఉచ్చు. ఇదో లోతైన మహా సముద్రం ఇందులో తిమింగళాలు ఉంటాయి, సొరచేపలు ఉంటాయి. ఇకపోతే రాజకీయం రెండు వైపులా పదునుగా ఉన్న కత్తిలాంటింది. అప్రమత్తంగా ఉంటే ఏవైపునుండైన గాయపరచవచ్చూ. ఇప్పుడున్న ఏపీ రాజకీయాల్లో ఇదే జరుగుతుందనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చేస్తున్న చర్చ రచ్చ రచ్చగా మారుతుంది.


పవన్ తీరుపై అధికార పార్టీ నాయకులు ఒకరకంగా ఘాటు విమర్శలే చేస్తున్నారు. ఈ దశలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు.. పవన్ సినిమాలు వదిలిపెట్టినా డైలాగ్‌లు వదలడం లేదు. రాజకీయాల్లో ఆయన వేసే డ్రామాలు చక్కగా ఉన్నాయని, అదే విధంగా పవన్ ఏనాడైనా తన అన్నయ్య చిరంజీవి పేరు చెప్పారా, కాని నేను చెబుతున్నా చిరంజీవి టికెట్‌ ఇస్తేనే నేను 2009లో గెల్చాను, అసలు నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం చిరంజీవి అని ఇప్పటికీ ఎప్పటికీ చెబుతాను, అని కన్నాబాబు పేర్కొన్నారు. 


పవన్‌ కళ్యాణ్ మీటింగ్‌లో గమనిస్తే ఎక్కడైనా స్థిరంగా నిలబడి  కనీసం ఒక్క నిమిషం అయినా మాట్లాడగలుగుతారా.. ఆయన ఊపులు, చేసే అరుపులకు ఎవరూ ఇక్కడ భయపడరు అని కన్నబాబు స్పష్టం చేసారు. ఇకపోతే పవన్ అప్పుడప్పుడు చేసే పనుల్లో విచిత్రంగా మట్టి పిడతల్లో మజ్జిగ అన్నం తినడం, కారు డిక్కీలో కూర్చుని టీ తాగడం, ట్రెయిన్‌లో టాయిలెట్‌ పక్కన కూర్చుని పుస్తకాలు చదువడం, వర్షం కురుస్తుంటే గొడుగు వేసుకుని ఆవుకు అరటిపండ్లు పెట్టడం. ఈవన్ని తను వేసే డ్రామాలు కాదా? ఈ తరహా డ్రామాలు చంద్రబాబు డైరెక్షన్‌లో చేస్తే, వెంటనే వాటిని విడిచి పెట్టండని సూచించారు.


ఇక మీరు వేసే డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని మీరెన్ని వేషాలేసిన అవేం ప్రజల ముందు పని చేయవని తెలిపారు. కాస్తైనా జగన్‌ ను చూసి సంస్కారం నేర్చుకోవాలన్నారు. ఎందుకంటే 151 స్థానాలు, 22 ఎంపీ సీట్లు గెల్చినా ఎంత ఒదిగి ఉంటున్నారో చూడండి అది సంస్కారవంతుని లక్షణం అని పేర్కొన్నారు.. ఇకపోతే పవన్‌ కళ్యాణ్‌ 2 లక్షల పుస్తకాలు చదివానంటున్నారు. వాటిలో ఎక్కడైనా వరదల్లో ఇసుక ఎలా తీయాలని ఉంటే చెప్పండి. వెంటనే ప్రయత్నిస్తామని కన్నబాబు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: