ఆర్టీసీ సమ్మె విషయంలో కేసియార్ లో టెన్షన్ పెరిగిపోతోంది. 5వ తేదీ అర్ధరాత్రిలోగా విధుల్లో చేరని ఉద్యోగులను, కార్మికులను డిస్మిస్ చేస్తానని తీవ్రంగా వార్నింగ్ ఇచ్చినా ఎవరూ లెక్క కూడా చేయలేదు. ఆర్టీసీలోని 43 వేల మంది సిబ్బందిలో కేసియార్ వార్నింగ్ తో విధుల్లో చేరింది కేవలం 200 మందే. వీళ్ళల్లో కూడా చాలామంది సంతకాలు పెట్టేసి మళ్ళీ సమ్మెలో చేరిపోయారట.

 

ఈ విషయంతోనే కేసీయార్ ను  ఆర్టీసి సిబ్బంది ఎలా జమకట్టారో అర్ధమైపోతోంది. అదే సమయంలో కేసియీర్ లో కూడా టెన్షన్ మొదలైపోయిందట. ఇపుడు ఆర్టీసీ సమ్మెకు గనుక తలొంచితే భవిష్యత్తులో ఉద్యోగులతో చాలా సమస్యలు ఎదురవుతాయనే భయం పెరిగిపోతోందని సమాచారం. ఏదో పేరుకు బంగరా తెలంగాణా అని కేసియార్ అంటున్నారు కానీ నిజానికి అంత సీన్ లేదన్నది వాస్తవం.

 

మొదటిసారి సిఎంగా ఉన్నపుడే కేసియార్ పై బాగా జనాల్లో మంట ఉండేది. కాకపోతే రాష్ట్రంలో టిఆర్ఎస్ ను బలంగా ఢీ కొనే స్ధాయి ప్రతిపక్షం లేదు కాబట్టే ముందస్తు ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్సే విజయం సాధించింది. రెండోసారి సిఎం అయినప్పటి నుండి కేసీయార్ వ్యవహారశైలిలో బాగా మార్పు వచ్చేసినట్లు పార్టీ నేతలే బాహటంగా ఆరోపణలు చేస్తున్నారు.

 

ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు కేసియార్ పై మండిపడుతున్న నేపధ్యంలోనే నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ ఉపఎన్నిక వచ్చింది. ఈ ఉపఎన్నికలో గెలుపు టిఆర్ఎస్ కు కష్టమనే ప్రచాం జరిగింది. అయితే అనూహ్యంగా మంచి మెజారిటితో అధికారపార్టీ అభ్యర్ధే గెలిచింది. ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా, అన్నీ వర్గాలు వ్యతిరేకించినా టిఆర్ఎస్ గెలవటంతో కెసియార్ పట్టటం కష్టమైపోయింది.

 

అందుకనే ఆర్టీసీ సమ్మె విషయంలో అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా టిఎన్జీవో తో పాటు ఉద్యోగ సంఘాలు మద్దతు పలకటం గమనార్హం. ఇపుడు ఆర్టీసీ సమ్మెకు తలొంచితే భవిష్యత్తులో ఉద్యోగసంఘాలు గనుక సమ్మె చేస్తే అపుడు వాళ్ళని ఎదుర్కోవటం కష్టమని కేసియార్ ఆందోళన చెందుతున్నారట. ఆ భయంలోనే ఆర్టీసీ సమ్మె విషయంలో గట్టిగా నిలబడినట్లు సమాచారం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: