తెలుగు రాష్ట్రాల్లో గంటా శ్రీనివాసరావు గురించి తెలియని వ్యక్తులు ఉండరు.  అయన రాజకీయాల్లో బాగా పడిపోయారు.  రాజకీయాలు చేయడంలో గురువు బాబుని మించిపోయిన శిష్యుడు.  అందుకే అయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఇమిడిపోతాడు.  పైచేయి సాధించడానికి ప్రయత్నం చేస్తాడు.  తెలుగుదేశం పార్టీలో ఓనమాలు దిద్దుకున్న గంటా.. ఆ తరువాత మెగాస్టార్ ప్రజారాజ్యంవైపు వెళ్లారు.  అక్కడ గెలిచారు.  


గెలిచినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.  మెగాస్టార్ పార్టీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది.  ఇది గంటాకు నచ్చలేదు.  కానీ, తప్పదు.  కాంగ్రెస్ లోకి వెళ్లాలని అనుకున్నావా ఎందుకో ఆగిపోయాడు.  2011 వరకు ఓపికపట్టాడు.  2011లో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావడంతో గంటాకు కలిసి వచ్చింది.  గంటా కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యాడు.  తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పాడు.  


2014 ఎన్నికలకు ముందు మరలా సొంత ఇల్లు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పోటీ చేసి విజయం సాధించాడు.  ఎప్పటిలాగే తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఐదేళ్లు పనిచేశాడు.  2019లో గంటా భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించాడు.  అయితే, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది.  వైకాపాలోకి వెళ్లాలన్నా ఇప్పుడు వెళ్లలేని పరిస్థితి.  ఆ పార్టీలోనే లెక్కకు మించి ఎమ్మెల్యేలు ఉన్నారు.  ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లినా ఉపయోగం ఉండదు.  అందుకే గంటా మరో ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.  తెలుగుదేశం పార్టీ నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తున్నాడు.  


అందుకోసం అన్ని సిద్ధం చేసుకున్నాడు.  తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాలని అనుకుంటున్నాడు.  దీనికోసం ఇప్పటికే బేరసారాలు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది.  బీమిలి నించి బీజేపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను కూడా గంటా తీసుకోబోతున్నాడని వినికిడి.  మరి దీనికి బీజేపీ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి.  బీజేపీలో చేరితే జాతీయ రాజకీయాల్లో ఉన్నట్టుగా ఉంటుంది.. అవకాశం దొరికితే మంత్రిగా పదవి దక్కించుకునే ఛాన్స్ కూడా వస్తుందని గంటా ఆలోచన.  


మరింత సమాచారం తెలుసుకోండి: